Coconut Water: వామ్మో.. చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు తాగిపిస్తే అంత డేంజరా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే, కొబ్బరి నీళ్లు అందరికీ మంచివేనా..? ముఖ్యంగా, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వడంపై చాలా మంది తల్లిదండ్రులకు సందేహాలు ఉన్నాయి. పిల్లల సున్నితమైన జీర్ణవ్యవస్థ కారణంగా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తాయి. అయితే ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వడం సురక్షితమేనా అనే ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తుంది. తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు కూడా పిల్లల్లో కడుపు నొప్పి, గ్యాస్ లేదా విరేచనాలు వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ విషయంలో AIIMS మాజీ శిశువైద్యుడు డాక్టర్ రాకేష్ బాగ్రి కీలక విషయాలు, జాగ్రత్తలు వివరించారు.
6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ వయస్సులో శిశువుకు తల్లి పాలు మాత్రమే ప్రధాన,ఏకైక ఆహారం కావాలి. తల్లి పాలే వారికి అవసరమైన పోషకాలు, హైడ్రేషన్‌ను అందిస్తాయి.
6 నెలల తర్వాత పిల్లలు
6 నెలల తర్వాత, శిశువు మృదువైన ఆహారం తినడం ప్రారంభించినప్పుడు, కొబ్బరి నీళ్లను కూడా ఇవ్వవచ్చు. మొదట్లో 1 నుండి 2 టీస్పూన్లు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని క్రమంగా పెంచాలి. డాక్టర్ రాకేష్ బాగ్రి ప్రకారం.. 6 నుండి 12 నెలల మధ్య పిల్లలకు కొబ్బరి నీళ్లు సప్లిమెంట్‌గా మాత్రమే ఇవ్వాలి. వారి నిజమైన పోషకాహారం తల్లి పాల నుంచే లభిస్తుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు
కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ, పిల్లలకు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఈ కింది విషయాలను తప్పక పాటించాలి
- వైద్యుడిని సంప్రదించకుండా ఎటువంటి కొత్త ఆహారం లేదా పానీయాన్ని శిశువుకు ఇవ్వకూడదు.
- ఎల్లప్పుడూ తాజా కొబ్బరిని ఎంచుకోండి. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్ చేసిన కొబ్బరి నీళ్లను అస్సలు
- ఇవ్వకూడదు. ఎందుకంటే వాటిలో చక్కెర, సంరక్షణకారులు ఉంటాయి.
- కొబ్బరి నీళ్లు ఇచ్చే ముందు.. శిశువుకు గ్యాస్, విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి కడుపు సమస్యలు లేవని
- నిర్ధారించుకోండి. సమస్యలు ఉంటే ఇవ్వడం ఆపాలి.
- కొత్త ఆహారాన్ని, పానీయాన్ని ఇచ్చేటప్పుడు కొద్ది మొత్తంలోనే అందించండి. రోజుకు ఒకసారి మాత్రమే ఇవ్వడం ఉత్తమం.
- 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉప్పు, చక్కెర లేదా తేనె వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు.
- తల్లిదండ్రులు ఏవైనా కొత్త లక్షణాలు లేదా ప్రతికూలతలు గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




