వారానికి రెండుసార్లు గ్లాసుడు అల్లం నీళ్లు తాగితే… ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు..!

అల్లంలో ఉండే విటమిన్లు ఎ, సి మీ జుట్టుకు చాలా మంచివి. అల్లంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అన్ని చర్మ సమస్యలను దూరం చేస్తాయి. అల్లం నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ కేలరీలు తినకుండా నిరోధిస్తుంది.

వారానికి రెండుసార్లు గ్లాసుడు అల్లం నీళ్లు తాగితే... ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు..!
Ginger Water

Updated on: Jul 16, 2025 | 8:22 PM

అల్లం.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. అల్లం ఆరోగ్యప్రయోజనాలు దాదాపు అందరికీ తెలుసు. ఆహారంలో భాగంగా అల్లం తీసుకోవటం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకుని తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. అందుకే చాలా మంది పచ్చి అల్లం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అల్లం తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అల్లం తినడానికి సులభమైన మార్గం అల్లం రసంలా తీసుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొంచెం అల్లం తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసి, అందులో తురిమిన అల్లం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చక్కటి టీలా మరిగించుకోవాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగాలి. రుచి నచ్చకపోతే, దానికి తేనె, నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

అల్లం అనేది శోథ నిరోధక ఆహారం. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ, ప్రేగుల పనితీరు, ఇతర జీర్ణ అవయవాలను నిర్వహించడం ద్వారా శరీర జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది మన థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. అల్లం రక్తాన్ని పలుచబరిచేదిగా పనిచేస్తుంది. ఇది మీ శరీరంలోని రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్లం నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ గుండె సమస్యలకు ప్రమాద కారకం. అల్లం చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. అల్లంలో ఉండే విటమిన్లు ఎ, సి మీ జుట్టుకు చాలా మంచివి. అల్లంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అన్ని చర్మ సమస్యలను దూరం చేస్తాయి. అల్లం నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ కేలరీలు తినకుండా నిరోధిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..