Buddha Motivation Quotes: బుద్ధుడు చెప్పిన ఈ సత్యాలు పాటిస్తే.. మీ జీవితమే మారిపోతుంది..

బుద్ధుడు గురించి అందరికీ తెలుసు. సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు.. బుద్ధుడిగా మారిన కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఈ కథను చదువుకునే ఉంటారు. ప్రశాంతతకు మారు పేరు గౌతమ బుద్ధుడు అని చెప్పొచ్చు. ప్రపంచంలో చాలా మంది ఈ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైతే ప్రశాంతంగా జీవించాలి అనుకుంటారో.. వారు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతీ మాట.. జీవితానికి ఓ పాఠంగా మారింది. చాలా మంది బుద్ధుడు..

Buddha Motivation Quotes: బుద్ధుడు చెప్పిన ఈ సత్యాలు పాటిస్తే.. మీ జీవితమే మారిపోతుంది..
Buddha Motivation Quotes

Updated on: Mar 18, 2024 | 3:59 PM

బుద్ధుడు గురించి అందరికీ తెలుసు. సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు.. బుద్ధుడిగా మారిన కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఈ కథను చదువుకునే ఉంటారు. ప్రశాంతతకు మారు పేరు గౌతమ బుద్ధుడు అని చెప్పొచ్చు. ప్రపంచంలో చాలా మంది ఈ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైతే ప్రశాంతంగా జీవించాలి అనుకుంటారో.. వారు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతీ మాట.. జీవితానికి ఓ పాఠంగా మారింది. చాలా మంది బుద్ధుడు చెప్పిన సూక్తులను కూడా పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇళ్లల్లో కూడా బుద్ధుడికి సంబంధించిన ఫొటోలు కూడా ఉంటాయి. బుద్ధుడు అంటేనే ప్రశాంతతకు మారు పేరు. అలాంటి బుద్ధుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే.. మీ జీవితమే మారిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు:

బుద్ధుడు చెప్పిన సూక్తుల్లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఏదీ శాశ్వాతం కాదని బుద్ధుడు బోధించాడు. ఇప్పుడున్న రోజుల్లో అందరిలోనూ దురాశ, స్వార్థం అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇతరులకు సహాయం చేయాడాన్నే మర్చిపోయారు. ఏ పని చేసినా భవిష్యత్తు కోసం ఆలోచించకుండా చేయాలని బుద్ధుడు చెప్పాడు.

సమయాన్ని వృథా చేసుకోకూడదు:

సమయం అనేది ఎప్పటికీ తిరిగి రానిది. కాబట్టి మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృథా చేసుకోకండి. ప్రతి క్షణం ఎంతో విలువైనదని బోధించాడు బుద్ధుడు.

ఇవి కూడా చదవండి

సానుభూతితో ఉండాలి:

ఎదుటి వారి పట్ల సానుభూతి, దయతో ఉండాలని బుద్ధుడు చెబుతాడు. మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో దయ, కరుణ అనేవి కూడా ఉండాలి. ఎవరైతే తమ జీవితంలో సానుభూతి, దయను కలిగి ఉంటారో.. వారు జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.

అహంకారాన్ని వదిలిపెట్టాలి:

నేను, నాది అన్న అహంకారాన్ని మనిషి వదిలి పెట్టాలి. అహకారం వల్ల అనుబంధాలను, స్నేహితులను కూడా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అహంకార కోపాన్ని పెంచుతుంది. అహంకారం ఉన్నవారు సమాజంలో గౌరవంగా బ్రతకలేరని బుద్ధుడు బోధనల్లో ఉంది. అదే విధంగా సుఖాలపై వ్యామోహం కూడా పెంచుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..