గుండె పోటు రావడానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. రెండేళ్ల పసి పాపల నుంచి.. ముసలి వయసులో ఉండేవారు కూడా హార్ట్ ఎటాక్‌కి గురవుతున్నారు. అసలు విషయం ఏంటో తెలిసే లోపే గుండె నొప్పితో కుప్పకూలి పోతున్నారు. ముఖ్యంగా యువత గుండె పోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. గుండె పోటు రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ హార్ట్ ఎటాక్‌లు బాగా ఎక్కువై పోతున్నాయి. జిమ్ చేసినా.. ఫిట్‌గా ఉన్నా సరే గుండె పోటుతో మరణిస్తున్నారు. అయితే ముందు నుంచే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే.. గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
చాలా మంది ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు. మీరు ఎంత ఫిట్‌గా ఉన్నా సరే.. ఒత్తిడికి ఎక్కువగా గురవుతూ ఉంటే.. మీకు ఖచ్చితంగా గుండె పోటు రావచ్చు. ఒత్తిడి, ఆందోళన, భయం.. అనేవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఒత్తిడిని తగ్గించుకునే చూడండి. అవసరం అయితే వైద్యులను సంప్రదించండి.
మీరు ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురవుతూ ఉంటే.. రెగ్యులర్ చెకప్ అవసరం. ఈ చెకప్ వల్ల.. ముందుగానే వ్యాధి తీవ్రత తెలుస్తుంది. దీని వల్ల మొదట్లోనే చికిత్స తీసుకోవచ్చు.
అధిక బరువు ఉంటే.. పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. స్థూలకాయం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.
గుండె పోటుకు మధుమేహం, బీపీ కూడా కారణాలు అవుతాయి. కాబట్టి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం ప్రమాదన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.
చాలా మంది నిద్రను అలసత్వం చేస్తూ ఉంటాడు. సరైన నిద్ర.. చాలా గుండె పోటే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అనేది చాలా అవసరం. అదే విధంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు