Cleaning Tips: నీటిలో వీటిని వేసి ఇల్లు క్లీన్ చేశారంటే.. కీటకాలు రానే రావు..

|

May 14, 2024 | 2:38 PM

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అప్పటికప్పుడే ఎండ ఎక్కువగా పెరుగుతుంది. మళ్లీ వెంటనే వాతావరణం మారి.. చల్లటి వీస్తూ వర్షం పడుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా కీటకాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. దోమలు, ఈగలు, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకు తెలియకుండా జ్వరాలు, నీరసం, ఇన్ ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు..

Cleaning Tips: నీటిలో వీటిని వేసి ఇల్లు క్లీన్ చేశారంటే.. కీటకాలు రానే రావు..
Cleaning Tips
Follow us on

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అప్పటికప్పుడే ఎండ ఎక్కువగా పెరుగుతుంది. మళ్లీ వెంటనే వాతావరణం మారి.. చల్లటి వీస్తూ వర్షం పడుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా కీటకాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. దోమలు, ఈగలు, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకు తెలియకుండా జ్వరాలు, నీరసం, ఇన్ ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు ఈ సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఇల్లు క్లీన్ చేస్తూ ఉండండి. కొన్ని పదార్థాలను కలపడం వల్ల ఇంట్లోకి చీమలు, దోమలు, ఇతర కీటకాలు రానే రావు. వచ్చినా.. వెంటనే పారిపోతాయి. మరి నీటిలో ఎలాంటి పదార్థాలు కలిపితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క:

మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కతో ఆహారం రుచి పెరగడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దాల్చిన చెక్క‌లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే దాల్చిన చెక్క నుంచి మంచి సువాసనతో పాటు ఘాటు వాసన కూడా వస్తుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి ఇంటిని తుడవడం వల్ల కీటకాలు అనేవి ఇంట్లోకి ప్రవేశించవు. దాల్చిన చెక్క వేసి నీటిని మరిగించి ఇంటిని తుడవాలి.

కర్పూరం:

ఇల్లు క్లీన్ చేసే నీటిలో కర్పూరం కూడా కలిపి శుభ్రం చేయవచ్చు. కర్పూరంతో పూజ మాత్రమే కాదు.. శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. కర్పూరాన్ని నీటిలో వేసి ఇంటికి క్లీన్ చేయడం వల్ల చీమలు, దోమలు, ఇతర సూక్ష్మ కీటకాలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

డిష్ వాషర్ సబ్బు:

డిష్ వాషర్‌ సబ్బుతో కేవలం గిన్నెలే కాకుండా.. ఇంటి ఫ్లోర్‌ కూడా శుభ్రం చేసుకోవచ్చు. డిష్ వాషర్ సబ్బును కొద్ది వాటర్‌లో నానబెట్టి.. ఇందులో బేకింగ్ సోడా వేసి.. ఇంటిని క్లీన్ చేస్తే.. ఇల్లు తెల్లగా ఉండటమే కాకుండా.. సూక్ష్మ క్రిములు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అయితే ముందు ఈ నీటితో తుడిచాక.. ఆ తర్వాత సాధారణ నీటితో కూడా తుడవాలి.

వెనిగర్:

అదే విధంగా వెనిగర్‌తో కూడా మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ వేసి ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఆ వాసనకు కీటకాలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..