Burn Injuries: కాలిన గాయాలపై ఐస్‌, టూత్‌ పేస్ట్ రాస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

|

Jul 12, 2024 | 3:24 PM

కాలిన గాయల నొప్పిని భరించలేక వెంటనే ఐస్ పెడుతుంటారు. లేదంటే, కాలిన గాయంపై టూత్‌పేస్ట్ అప్లై చేస్తుంటారు. కానీ, ఇలా చేయటం సరికాదంటున్నారు నిపుణులు. కాలిన చర్మంపై చల్లటి పదార్థాన్ని పూయడం వల్ల బొబ్బలు రాకుండా ఉంటాయని భావిస్తారు. కాలిన ప్రదేశంలో ఐస్ లేదా టూత్‌పేస్ట్‌ను ఎప్పుడూ పూయకూడదట.. ఇలా చేయటం వల్ల..

Burn Injuries: కాలిన గాయాలపై ఐస్‌, టూత్‌ పేస్ట్ రాస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
Burn Injuries
Follow us on

వంట చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, మంటకు సంబంధించి ఏ ఇతర పనులు చేస్తుండగా కొన్ని సార్లు చేతులు కాలుతుంటాయి, గాయాలు అవుతుంటాయి. ఉంటాయి. కాలిన గాయాలు విపరీతమైన మంట, నొప్పిని కలిగిస్తాయి. బొబ్బలు, ఆపై మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. కాలిన గాయల నొప్పిని భరించలేక వెంటనే ఐస్ పెడుతుంటారు. లేదంటే, కాలిన గాయంపై టూత్‌పేస్ట్ అప్లై చేస్తుంటారు. కానీ, ఇలా చేయటం సరికాదంటున్నారు నిపుణులు. కాలిన చర్మంపై చల్లటి పదార్థాన్ని పూయడం వల్ల బొబ్బలు రాకుండా ఉంటాయని భావిస్తారు. కాలిన ప్రదేశంలో ఐస్ లేదా టూత్‌పేస్ట్‌ను ఎప్పుడూ పూయకూడదట.. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలిన చర్మంపై ఐస్ లేదా టూత్‌పేస్ట్‌ను అప్లై చేయటం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. కాలిన చర్మం త్వరగా నయం కాకుండా మరింత ఆలస్యం అవుతుంది. అయితే, మీ చేయి లేదా చర్మం కాలినప్పుడు ముందుగా ఏం చేయాలో తప్పక తెలుసుకోవాలి.

అనుకోకుండా చర్మం కాలినప్పుడు వెంటనే ఆ ప్రదేశంపై ట్యాప్‌ నీటిని పట్టాలి. ట్యాప్‌ ఓపెన్‌ చేసి15 నుండి 20 నిమిషాల పాటు నడుస్తున్న నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, బ్యాక్టీరియా శుభ్రపడతాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతే కాదు, కొంతమంది చర్మం కాలినప్పుడు కాలిన ప్రదేశంలో నెయ్యి లేదా నూనెను రాస్తారు. కానీ, ఇలా చేయడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. కాలిన ప్రాంతాన్ని రన్నింగ్‌ వాటర్‌ కింద కడిగిన తర్వాత మాత్రమే బర్న్ క్రీమ్ అప్లై చేయాలి. డాక్టర్‌ సూచించిన మెడిసిన్‌ మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి.

మీకు మరింత త్వరగా చికిత్స అవసరమైతే, కాలిన గాయాలపై అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ స్ప్రే ఉపయోగించవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో అనుకోకుండా కాలిన చిన్న గాయాలకు మాత్రమే ఇలాంటి చిట్కాలు, వైద్యం పాటించాలి. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..