ఎన్ని సార్లు రిపేర్ చేసినా కుక్కర్‌ లీకేజీ ఆగటం లేదా..? ఇలా చేస్తే సరి…!

నేటి బిజీ లైఫ్‌లో దాదాపు ప్రతి ఒక్కరూ ప్రెషర్‌ కుక్కర్‌ను వాడుతున్నారు. ఈజీగా త్వరగా వంట పూర్తి చేయాలంటే కుక్కర్‌ తప్పనిసరి. కానీ, ఒక్కోసారి పప్పులు ఉడికించినప్పుడు, అన్నం వండినప్పుడు ప్రెషర్‌ కుక్కర్‌లోంచి నీరు అంతా బయటకు వచ్చి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈజీగా అవుతుందనుకున్న పని కుక్కర్ లీకేజీతో డబుల్‌ అవుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించి చూడండి..

ఎన్ని సార్లు రిపేర్ చేసినా కుక్కర్‌ లీకేజీ ఆగటం లేదా..? ఇలా చేస్తే సరి…!
Pressure Cooker Leakage

Updated on: Nov 02, 2025 | 5:36 PM

వంట చేసేటప్పుడు పప్పులు వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు కుక్కర్‌ను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. అయితే, కొన్నిసార్లు వంట చేసేటప్పుడు కుక్కర్ విజిల్ నుండి వాటర్‌ లీక్‌ అవుతూ ఉంటుంది. దీంతో పని భారం పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వంట చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ను బాగా కడగాలి. స్టీమ్ వాల్వ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. కుక్కర్లో వంట చేసినప్పుడు నాలుగు వంతులలో ఒక వంతు స్థలం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

అలాగే, రబ్బరు కూడా ప్రెజర్ కుక్కర్‌లో ఒక ముఖ్యమైన భాగం. కుక్కర్‌ లాక్‌ చేయాలంటే ఇది తప్పనిసరి. ఈ వాల్వ్ దెబ్బతిన్నట్లయితే కుక్కర్ నుండి నీరు లీక్ కావచ్చు. రబ్బరు దెబ్బతిన్నట్లయితే వెంటనే దాన్ని మార్చండి.

దీంతో పాటు ప్రెజర్ కుక్కర్ మూత గట్టిగా, సురక్షితంగా అమర్చాలి. అది వదులుగా ఉంటే లేదా తప్పుగా అమర్చినట్లయితే కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది. కుక్కర్ లోపల ఒక ప్రెజర్ కంట్రోలర్ ఉంటుంది. ఇది ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. అది పాడైపోయినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. అది మురికి పట్టి ఉంటే దానిని శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..