AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బాత్‌రూమ్‌లో బకెట్, మగ్ పసుపు రంగులోకి మారిపోయాయా? ఈ 3 చిట్కాలతో 10 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించండి!

బాత్‌రూమ్‌లో మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్లు, మగ్‌లు కొద్దిరోజులకే తెల్లటి పొరలతో లేదా పసుపు రంగు మరకలతో మురికిగా తయారవుతాయి. గట్టి నీరు, సబ్బు, షాంపూల నిరంతర వాడకం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలాంటి మురికి బకెట్లు ఉంటే బాత్‌రూమ్ అంతా అశుభ్రంగా కనిపిస్తుంది. చాలామంది ఈ మొండి మరకలను వదిలించలేక పాత వాటిని పారేసి కొత్తవి కొంటుంటారు. కానీ, మీ వంటగదిలో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే కేవలం 10 నిమిషాల్లో వీటిని కొత్తవాటిలా మెరిపించవచ్చని మీకు తెలుసా? ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మీ బాత్‌రూమ్‌లో బకెట్, మగ్ పసుపు రంగులోకి మారిపోయాయా? ఈ 3 చిట్కాలతో 10 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించండి!
Bathroom Cleaning TipsImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2026 | 4:07 PM

Share

బాత్‌రూమ్‌లోని ప్లాస్టిక్ బకెట్లు, మగ్‌లపై గట్టి నీరు (హార్డ్ వాటర్), సబ్బు జిడ్డు వల్ల త్వరగా పసుపు రంగు మరకలు, తెల్లటి పొరలు ఏర్పడతాయి. వీటిని శుభ్రం చేయడానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అంతేకాదు.. ప్లాస్టిక్‌ బక్కెట్లను ఎంతకాలం ఉపయోగించాలో కూడా తప్పక తెలుసుకోవాలి. లేదంటే, రోగాల బారినపడే ప్రమాదం ఉంటుంది.

బేకింగ్ సోడా, వెనిగర్ :

మరకలు చాలా పాతవి, మొండివి అయితే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా బకెట్ లేదా మగ్‌పై 2 నుండి 3 చెంచాల బేకింగ్ సోడా చల్లాలి. ఆ తర్వాత దానిపై కొద్దిగా వైట్ వెనిగర్ పోయాలి. ఇవి రెండూ కలిసినప్పుడు నురుగు వస్తుంది. ఈ మిశ్రమాన్ని మరకలు ఉన్న చోట బాగా పూసి 10-15 నిమిషాల పాటు వదిలేయాలి. అనంతరం స్క్రబ్బర్ లేదా బ్రష్‌తో తేలికగా రుద్ది, మంచి నీటితో కడిగితే మురికి అంతా నిమిషాల్లో మాయమవుతుంది.

నిమ్మకాయ, ఉప్పు దేశీయ చిట్కా:

నిమ్మకాయలో సహజసిద్ధమైన యాసిడ్ ఉంటుంది. ఇది గట్టి నీటి మరకలను తొలగించడంలో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి, దానిపై కొద్దిగా ఉప్పు చల్లాలి. దీనిని బకెట్, మగ్‌లపై మరకలు ఉన్న భాగంలో బాగా రుద్దాలి. 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో కడిగేయాలి. ఇది మరకలను వదిలించడమే కాకుండా, మంచి సువాసనను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన మురికి కోసం బ్లీచ్ వాడకం:

బకెట్ బాగా నల్లగా లేదా పసుపు రంగులోకి మారిపోయి, క్రిమిరహితం (Disinfect) కావాలనుకుంటే బ్లీచ్ వాడాలి. ఒక పెద్ద టబ్‌లో నీరు తీసుకుని అందులో కొద్దిగా బ్లీచ్ పౌడర్ లేదా లిక్విడ్ కలపాలి. ఈ నీటిలో మురికి బకెట్, మగ్‌లను 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత సాధారణ బ్రష్‌తో తోమితే అవి సరికొత్తగా మెరుస్తాయి.

బకెట్లను ఎప్పుడు మార్చాలి?:

మరకలు పోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో బకెట్లను మార్చడం ఆరోగ్యకరం. ప్లాస్టిక్ బకెట్‌కు ఎక్కడైనా పగుళ్లు (Cracks) వచ్చి నీరు కారుతున్నా, బ్లీచ్ లేదా నిమ్మకాయ వాడినా దుర్వాసన తగ్గకపోయినా, ప్లాస్టిక్ ఉపరితలం గరుకుగా మారినా లేదా బకెట్ 2-3 సంవత్సరాల కంటే పాతదైనా వాటిని మార్చేయడం మంచిది. వారానికి ఒకసారి వేడి నీళ్లలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి కడుగుతుంటే బకెట్లపై మరకలు అస్సలు పేరుకుపోవు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us