AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో టవల్స్ స్మెల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా..? చిటికెలో ఇలా మాయం చేయండి..!

వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ.. టవల్ తడిగా ఉండిపోతే వాసన రావడం మామూలే. తడిగా ఉన్నప్పుడు టవల్‌ ను సరిగా ఆరబెట్టకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగిపోతాయి. ఇవే వాసన కు కారణం అవుతాయి. అంతే కాదు చర్మ సమస్యలు కూడా తెస్తాయి.

వర్షాకాలంలో టవల్స్ స్మెల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా..? చిటికెలో ఇలా మాయం చేయండి..!
Bad Smell From Towels
Prashanthi V
|

Updated on: Jul 30, 2025 | 7:10 PM

Share

టవల్‌ ను రోజూ వాడిన తర్వాత బాగా ఆరబెట్టకపోతే.. అందులోని తేమ బ్యాక్టీరియా పెరగడానికి మంచి వాతావరణం అవుతుంది. ఎక్కువగా మూసిన చోట టవల్ ఉంచడం.. తడిగా మడచి పెట్టడం వాసనకు ప్రధాన కారణాలు. కేవలం ఉతకడం మాత్రమే కాదు.. టవల్‌ ను ఎలా ఉతికి ఆరబెడుతున్నామన్నది చాలా ముఖ్యం.

వాసన పోగొట్టే ఇంటి చిట్కాలు

నిమ్మ తొక్కలు, వెనిగర్.. నిమ్మ తొక్కలలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజంగానే క్రిములను చంపుతుంది. వెనిగర్ కూడా బ్యాక్టీరియాను చంపగలదు. ఈ రెండు కలిపితే టవల్ వాసన ఖచ్చితంగా తగ్గుతుంది.

టవల్ వాసన వదిలించుకోవడానికి ఉతికేటప్పుడు డిటర్జెంట్‌ తో పాటు ఒక కప్పు తెల్ల వెనిగర్, కొన్ని నిమ్మ తొక్కలు కలపండి. వేడి నీళ్లతో ఉతకడం వల్ల ఫంగస్ బాగా పోతుంది. వేడి నీరు ఫంగస్‌ ను పోగొట్టడంలో చాలా బాగా సహాయం చేస్తుంది.

బేకింగ్ సోడా.. మొదటి వాష్ అయిన తర్వాత మరోసారి వేడి నీళ్లతో అర కప్పు బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఉతకండి. ఇది మిగిలిన వాసనలను పీల్చుకుని టవల్‌ ను కొత్తగా, ఫ్రెష్‌గా చేస్తుంది.

నిమ్మరసం, బేకింగ్ సోడా.. ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. అందులో ఒక కప్పు బేకింగ్ సోడా, రెండు నుండి మూడు నిమ్మ పండ్ల రసం కలపండి. ఈ ద్రావణంలో టవల్‌ ను 30 నిమిషాల నుండి ఒక గంట వరకు నానబెట్టండి. తర్వాత వాషింగ్ మెషిన్‌లో మామూలుగా ఉతికి, ఎండలో బాగా ఆరబెట్టండి.

ఆరబెట్టడం కూడా చాలా కీలకం

టవల్‌ ను ఎండలో పూర్తిగా ఆరనివ్వకపోతే వాసన పూర్తిగా పోదు. తడిగా ఉన్న టవల్‌ ను మడిచి పెడితే సూక్ష్మజీవులు మళ్ళీ వాసన పుట్టిస్తాయి. అందుకే ప్రతిసారి టవల్ పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే మడత చేయాలి. ఈ చిట్కాలు ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతో చేయొచ్చు. వీటితో మీ టవల్ శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది.