వర్షాకాలంలో ఇవి తీసుకుంటే చాలు.. ఏ జబ్బులు మీ దరిచేరవు..!
వర్షాకాలంలో చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మందులకు బదులుగా ఇంట్లోనే అందుబాటులో ఉండే సహజ మూలికలతో చికిత్స చేయవచ్చు. అందులో ముఖ్యమైనది పిప్పలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన ఔషధం.

వానలో తడవడం వల్ల చాలా మందికి జలుబు, జ్వరం, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. మందులు వాడితే ఇవి తగ్గుతాయి. కానీ మన ఇంటి చిట్కాలు కూడా వీటిని తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీని కోసం మీ వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు చాలు. వాటిలో ఒకటి పిప్పలి అనే ఒక ప్రత్యేకమైన మూలిక.
ఆరోగ్యానికి మహా ఔషధం
పిప్పలి కేవలం వంటకు వాడే మసాలా దినుసు మాత్రమే కాదు.. ఇది అనేక ఔషధ గుణాలున్న ఒక ప్రత్యేకమైన మూలిక. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. పిప్పలిని సాధారణంగా గరం మసాలాలో వాడతారు కానీ ఆరోగ్యానికి దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించడానికి పిప్పలి బాగా సహాయపడుతుంది.
పిప్పలి వాడే సరైన పద్ధతి
పిప్పలి పేస్ట్ లేదా పొడిని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాసు పాలలో వేసి మరగనివ్వండి. ఇంకా మంచి ఫలితం కోసం ఇందులో కొద్దిగా పసుపు కలపడం మంచిది. పసుపు సహజంగానే వైరస్ లను చంపుతుంది, వాపును తగ్గిస్తుంది, శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యానికి కలిగే లాభాలు
ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో కూడా పిప్పలికి గొప్ప స్థానం ఉంది. ఇది కేవలం జలుబు తగ్గించడమే కాదు.. జీర్ణశక్తిని పెంచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పిప్పలిలో ప్రోటీన్లు, వాపు తగ్గించే గుణాలు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఎలా తీసుకోవాలి..?
పిప్పలిని పొడి రూపంలో లేదా నూనె రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే ఏ రూపంలో తీసుకున్నా సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా తీసుకుంటే కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే పిప్పలిని వాడే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇంట్లో ఉండే సహజ వస్తువులతోనే మన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనడానికి పిప్పలి ఒక అద్భుతమైన ఉదాహరణ. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వెంటనే మందుల కోసం పరుగులు తీయకుండా ఒకసారి ఇలా చేసి చూడండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




