Herbal Hair Oil : ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుందట..!

|

Mar 18, 2023 | 7:30 PM

ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడం ద్వారా జుట్టును అందంగా, మందంగా, బలంగా మార్చేస్తుంది.

Herbal Hair Oil : ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుందట..!
Herbal Hair Oil
Follow us on

జుట్టు మీ అందాన్ని పెంచుతుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది. దీనికి తోడు వెంట్రుకలు సరిగా పెరగకపోవడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఇక్కడ ఒక చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం..కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతి గింజలు, ఆలివ్ గింజలు, మందార పువ్వులతో తయారు చేసిన ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు రాలే సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడం ద్వారా జుట్టును అందంగా, మందంగా, బలంగా మార్చేస్తుంది.

హెర్బల్‌ హెయిర్‌ ఆయిల్ తయారీకి అవసరమైన పదార్థాలు

– ఒక ఇనుప పాన్
– కొబ్బరి నూనె
– కరివేపాకు
– మెంతులు
– 1 టీస్పూన్ ఆలివ్ గింజలు
– మందార పువ్వులు

హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి?

– హెర్బల్ హెయిర్ ఆయిల్ చేయడానికి ముందుగా ఒక ఐరన్‌ పాన్ తీసుకోవాలి.
– తర్వాత అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి.
– దీని తర్వాత, వేడి నూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి, గ్యాస్ ఆఫ్ చేయండి.
– తర్వాత మెంతి గింజలు, ఒక చిన్న చెంచా ఆలివ్ గింజలను కలపండి.
– ఆ తర్వాత మందార పూలను కూడా వేసి కలపాలి.
– తర్వాత రాత్రంతా అలాగే నిల్వ ఉంచుకోండి.

ఇవి కూడా చదవండి

హెర్బల్ ఆయిల్ తో మసాజ్ చేయడం ఎలా?

– హెర్బల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసే ముందు ఆ నూనెను ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి.
– తర్వాత అరచేతిలో నూనె తీసుకుని జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి.
– మీ స్కాల్ప్ వెనుక భాగంలో కింది నుంచి పైకి మసాజ్ చేయండి.
– మీ వేళ్లతో వృత్తాకారంలో మసాజ్ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..