చాలా మంది వారి బట్టలను ఇళ్లలోనే స్వయంగా ఐరన్ చేసుకుంటుంటారు. అలాంటప్పుడు కొన్ని రకాల దుస్తుల పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఏ మాత్రం వేడి తగిలినా అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే, సిల్క్ దుస్తులకు తమదైన క్రేజ్ ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోతుంది. వాటిని కాల్చకుండా చాలా జాగ్రత్తగా ఐరన్ చేయాల్సి ఉంటుంది. పట్టు బట్టలు చాలా సున్నితమైనవి. కొంచెం ఎక్కువ వేడి తగిలిందంటే..అవి వెంటనే ముడుచుకుపోవటం, కాలిపోవటం జరుగుతుంది. అందువల్ల పట్టు బట్టలను ఐరన్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. సిల్క్ దుస్తులను ఐరన్ చేసే క్రమంలో పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఫాయిల్ పేపర్ పని చేస్తుంది..
అల్యూమినియం ఫాయిల్ పేపర్ ప్రత్యేకత ఏమిటంటే అది త్వరగా కాలిపోదు. అందువలన మీరు పట్టు బట్టలు ఐరన్ చేయడానికి దీనిని వాడొచ్చు. మీరు సిల్క్ చీర లేదా సూట్ ఐరన్ చేయాలనుకున్నప్పుడు..దానిపై ఒక రేకును వేసి ఐరన్ చేయండి.. ఇలా చేస్తే మీ బట్టలు సరిగ్గా ఇస్త్రీ అవుతాయి. కాలిపోదు.
రివర్స్ లో చేయటం మంచిది..
అధిక ఉష్ణోగ్రతలో కూడా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. మీకు ఇష్టమైన డ్రెస్ కాలిపోకుండా ఉండాలంటే ఆ బట్టలను సీదా కాకుండా లోపలి వైపు నుంచి ఇస్త్రీ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా మీరు ఐరన్ బాక్స్ హీట్ సిల్క్ టెంపరేచర్‌కు సెట్ చేసుకోండి.. ఆ తర్వాత దుస్తులను ఉల్టా చేయండి. ఇలా చేసిన తర్వాత కాస్త బలంగా, జాగ్రత్తగా ఐరన్ చేసుకోండి.
కాగితం సహాయం తీసుకోండి..
మీ బట్టలను కాగితంతో ఇస్త్రీ చేయడం వల్ల మీ బట్టల మెరుపు అలాగే ఉంటుంది. అది కాలిపోదు. దీని కోసం రెండు న్యూస్ పేపర్లను తీసుకొని వాటిని పట్టు బట్టలపై పర్చుకోవాలి. ఆ తర్వాత దానిపై ఐరన్ చేయండి.
గుడ్డ సహాయం తీసుకోండి..
పట్టు బట్టలు కాలకుండా కాపాడటానికి, మీరు మరొక గుడ్డ సహాయం కూడా తీసుకోవచ్చు. సిల్క్ క్లాత్‌పైనుంచి వెరోక క్లాత్ వేసి దానిపై నుండి ఐరన్ చేయాలి. ఇలా పైన వాడే క్లాత్ కాటన్ అయితే మంచిది. ఇలా కూడా మీ సిల్క్ దుస్తులను కొత్తవాటిలా, నీట్‌గా ఐరన్ చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..