మార్కెట్లో కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి..

|

May 13, 2023 | 12:19 PM

వేసవి కాలంలో మామిడి పండ్లను తినడానికి అన్ని వయసుల వారు చిన్నా పెద్ద ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఈ జ్యూసీ ఫ్రూట్‌ను ఆస్వాదించడానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు .

మార్కెట్లో కెమికల్స్‌తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి..
Mangoes
Follow us on

వేసవి కాలంలో మామిడి పండ్లను తినడానికి అన్ని వయసుల వారు చిన్నా పెద్ద ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఈ జ్యూసీ ఫ్రూట్‌ను ఆస్వాదించడానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు . మామిడి పండ్లకు డిమాండ్ పెరగడంతో కొందరు విక్రయదారులు త్వరగా పక్వానికి రావడానికి కెమికల్ ఇంజెక్షన్లు వాడుతుంటారు.దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయానికొస్తే, ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి.

సహజంగా పండిన మామిడిపండ్లు కృత్రిమంగా పండిన మామిడి పండ్ల మధ్య తేడాను మీరు గుర్తించగలగాలి. అప్పుడే మనం ఆరోగ్యం కాపాడుకోగలం. ముఖ్యంగా కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను తింటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే కెమికల్స్ తో పండించిన మామిడి పండు జోలికి వెళ్లకుండా సహజంగా పండిన మామిడిపండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలాంటి రసాయనాన్ని ఉపయోగిస్తారు?

ఇవి కూడా చదవండి

మామిడి పండ్లను పక్వానికి తీసుకురావడానికి కాల్షియం కార్బైడ్ ఇంజెక్ట్ చేస్తారు, ఇది తేమతో తాకినప్పుడు ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది మామిడి పండ్లను త్వరగా పండించడానికి సహాయపడుతుంది. దీని కారణంగా, చర్మం చికాకు, శ్వాసకోశ సమస్యలు జీర్ణశయాంతర సమస్యలు వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

సరైన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి:

మామిడి పండ్ల రంగుపై శ్రద్ధ వహించండి: మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు, మామిడి రంగుపై శ్రద్ధ పెట్టడం మర్చిపోవద్దు. రసాయన ఇంజెక్షన్ ద్వారా మామిడి పండినప్పుడల్లా, దానిపై ఆకుపచ్చని మచ్చలు కనిపిస్తాయి వాటిని సులభంగా గుర్తించవచ్చు.

 మామిడి పరిమాణం:

మామిడిని కొనుగోలు చేసేటప్పుడు, దాని పరిమాణంపై కూడా శ్రద్ధ వహించండి. రసాయనిక పద్ధతిలో పండిన మామిడి పండ్ల పరిమాణం చాలా చిన్నది. వీటి నుండి రసం కారడం కనిపిస్తుంది. అలాంటి మామిడిపండుపై తెలుపు లేదా నీలం రంగు గుర్తుతో కనిపిస్తే పొరపాటున కూడా కొనుక్కోవద్దు. ఎందుకంటే అది రసాయనాలతో పండిన మామిడి కావచ్చు.

 మామిడి పండ్లను నీటిలో ముంచండి:

రసాయనికంగా పండిన మామిడి పండ్లను నీటిలో ముంచడం ద్వారా కూడా మీరు గుర్తించవచ్చు. నీటిలో మునిగిపోయే మామిడి పండ్లు సహజంగా పండినవి. కాగా నీటిపై తేలియాడే మామిడికాయను రసాయనాలతో వండుతున్నారు.

 మామిడిని నొక్కి చూడండి:

పండిన తీపి మామిడిని గుర్తించడం చాలా సులభం. మామిడిని కొనుగోలు చేసేటప్పుడు, దానిని కొద్దిగా నొక్కడానికి ప్రయత్నించండి. సంపూర్ణ మృదువైన మామిడి పండ్లు సహజంగా పండినవి. కానీ ఎక్కడో ఒక చోట బిగుతుగా అనిపిస్తే లేదా మామిడి పండినట్లు కనిపించినా పండక పోయినా రసాయనాలతో వండినట్లు అర్థం చేసుకోండి.

మీరు సహజ సిద్ధమైన మామిడి పండ్లను తినాలి అనుకుంటే గ్రామాల్లో పండ్లతోటల వద్దకు వెళ్లి రైతుల వద్ద నేరుగా పశ్చిమామిడికాయలను కొనుగోలు చేసి వాటిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత బియ్యం బస్తాలో, వరి గడ్డి వేసిన బస్తాలో కానీ ఉంచడం ద్వారా సహజసిద్ధంగా మామిడిపండ్లను మగ్గ పెట్టవచ్చు. అప్పుడు అందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. మీకు అత్యంత శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం