AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఎక్కువ రోజులు పిండిని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..

నేటి యుగం ఉరుకుల పరుగులతో సాగుతోంది. కాలంతో పోటీ పడుతూ పనులు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు.. ఇల్లాలుగా, ఉద్యోగిగా బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే వీలైనంత ఎక్కువ పనిని చేసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా కట్ చేసిన కూరగాయల నుంచి టిఫిన్ కోసం రెడీ చేసుకునే పిండి వరకూ ఎక్కువ మొత్తంలో రెడీ చేసుకుని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇలా పిండిని ప్రిడ్జ్ లో పెట్టి ఆ పిండిని ఎక్కువ రోజులు ఉపయోగిస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా..

Kitchen Hacks: ఎక్కువ రోజులు పిండిని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
Kitchen Hacks
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 19, 2025 | 4:27 PM

Share

ప్రస్తుతం కాలంతో పోటీ పడుతూ పనులు చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్నే టిఫిన్ అందించాలి అదే సమయంలో లంచ్ ని కూడా రెడీ చేయాలి. ఇల్లాలు, ఉద్యోగిగా రెండు చేతులతో క్షణం తీరిక లేకుండా శక్తి మించిన పనులు చేస్తున్నారు. దీంతో సమయం ఉన్నప్పుడే పనులు చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్ చేయడానికి వారానికి సరిపడా పిండిని ఒక్కసారిగా రెడీ చేసుకుంటున్నారు. ఆ పిండిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తున్నారు. కొంత మంది అయితే ఏకంగా డీ ఫ్రిజ్ లో పిండిని నిల్వ చేసేవారు కూడా ఉన్నారు. ఇలా పిండిని ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఎంత ప్రమాదమో తెలుసా..

ఇడ్లీ, దోశలు వంటి టిఫిన్స్ కోసం మినప పిండిని గతంలో ఏరోజుకా రోజు రెడీ చేసుకునేవారు. అయితే ఇప్పుడు అంత సమయం దొరకడం లేదు కనుక.. ఎక్కువ రోజులకు సరిపడా పిండిని ఒక్కసారిగా రెడీ చేసుకుని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుంటున్నారు. తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిండిని తీసుకుని టిఫిన్ తయారుచేసుకుంటున్నారు. ఇలా చేయడం వలన సమయం అదా అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అయితే ఇలా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన పిండిలో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతుంది. ఈ పిండితో చేసిన ఆహారం ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది.

పిండిలో కంటికి కనిపించని ఫంగల్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. అంతేకాదు పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత ఆ పిండి కాలక్రమేణా పులుస్తుంది. అంటే పిండిలో ఈస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. శరీరంలో అలెర్జీ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ అలెర్జీ సమస్య ఒక్కసారి వస్తే.. దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఒకొక్కసారి వికారం, వాంతులు వంటి ఇతర జీర్ణ సమస్యలు కలగవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రిడ్జ్ లో పిండిని ఎక్కువ రోజులు పెట్టడం .. ఆ పిండితో చేసిన ఆహారం తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కడుపులోని జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. ఆహార సంక్రమణకు కారణమవుతుంది. అంతేకాదు ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు కూడా హానిని చేస్తుంది. ఒకొక్కసారి కడుపులో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది.

పేగు ఇన్ఫెక్షన్ ప్రమాదం.. ముఖ్యంగా ఇలా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పిండితో చేసిన ఆహారం తింటే ప్రేగులలో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టిరియా మైక్రోబయోటాపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు శరీర సహజ ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అప్పుడు దీర్ఘకాలంగా కడుపు నొప్పి, తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు.

కనుక ఇప్పటి నుంచి ఎక్కువ మొత్తంలో పిండిని అవసరమైనంత మాత్రమే తయారు చేసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచకుండా తాజా పిండిని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే పేగులు, జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..