Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరకు లోయను తలపించే అనంతగిరి హిల్స్ చూశారా..! తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ..!

ఉద్యోగ, బిజినెస్ పనులతో బిజీగా ఉండేవారు వీకెండ్ ట్రిప్‌కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం హైదరాబాదు నుండి అనంతగిరి హిల్స్‌ వరకు స్పెషల్ ప్యాకేజీ అందిస్తోంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చల్లని వాతావరణం ఆస్వాదిస్తూ ఒకరోజు ప్రయాణంలోనే మధురమైన అనుభూతిని పొందే అవకాశం ఇది.

అరకు లోయను తలపించే అనంతగిరి హిల్స్ చూశారా..! తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ..!
Ananthagiri Hills
Follow us
Prashanthi V

|

Updated on: Mar 16, 2025 | 7:22 PM

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కు వెళ్లాలనుకునేవారు మనలో చాలా మందే ఉంటారు. ఉద్యోగ, బిజినెస్ పనులతో తీరికలేకపోయినవారు వీకెండ్‌లో ట్రిప్‌లకు వెళ్లి రిలాక్స్ అవుతుంటారు. ఎక్కువ రోజులు సమయం లేకపోతే ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం నుండి అద్భుతమైన ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ అరకు లోయగా పేరొందిన అనంతగిరి హిల్స్‌ పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది.

అనంతగిరి హిల్స్ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూసినవారిని మంత్రముగ్ధులను చేస్తాయి. అందమైన ప్రకృతి మధ్య రిలాక్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. సెలవులు, వీకెండ్ రోజుల్లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం హైదరాబాద్ – అనంతగిరి – బ్యాక్ వన్‌డే టూర్ పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ ట్రిప్‌ అందుబాటులో ఉంటుంది.

ప్రయాణ వివరాలు

  • టూర్ బుక్ చేసుకున్నవారు సికింద్రాబాద్ యాత్రి నివాస్ వద్ద బస్సు ఎక్కాలి.
  • ఉదయం 9 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • 9:30 గంటలకు బషీర్‌బాగ్ వద్ద కూడా బస్సు ఎక్కే అవకాశం ఉంటుంది.
  • మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు.
  • 12:00 – 12:30 వరకు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం.
  • 12:30 – 1:00 వరకు ఫారెస్ట్ విజిట్ (ఇది పూర్తిగా ఆప్షనల్, చూడాలనుకునేవారు వెళ్లొచ్చు).
  • 1:30 – 2:30 వరకు హరిత హోటల్‌లో లంచ్.
  • 2:30 – 4:30 వరకు గేమ్స్ ఆడుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు.
  • 4:30 – 5:00 వరకు హరిత హోటల్‌లో టీ, స్నాక్స్.
  • సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరుతుంది.
  • రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది.

టికెట్ ధరలు

  • పెద్దలకు 1800 రూపాయలు
  • పిల్లలకు 1440 రూపాయలు

ప్యాకేజీలో కలిపిన సదుపాయాలు

  • హైదరాబాద్ – అనంతగిరి – హైదరాబాద్ నాన్ ఏసీ బస్సు ప్రయాణం
  • మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టీ, స్నాక్స్

మరిన్ని వివరాల కోసం

  • టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాల కోసం 9848540371 నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
  • లేదా తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఈ ప్రత్యేకమైన ప్యాకేజీతో ఒకరోజులోనే అనంతగిరి అందాలు చూసి మధురమైన అనుభూతిని పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.