AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతి కథ: రాక్షస గుండె కూడా నిజాయితీకి కరగాల్సిందే..!

Cow and Tiger Moral Story: మనిషి జీవితంలో సంపద, అధికారం, హోదా కంటే కూడా నిజాయితీ ఎక్కువ విలువైనది. ఎందుకంటే నిజాయితీ ఉన్న వ్యక్తిపై కుటుంబం, స్నేహితులు, సమాజం నమ్మకం ఉంచుతాయి. కొన్నిసార్లు నిజాయితీ వల్ల తాత్కాలికంగా నష్టాలు ఎదురైనా, చివరికి అదే మనకు గౌరవాన్ని, గుర్తింపును తీసుకువస్తుంది. నిజాయితీ, మంచితనం, ఇచ్చిన మాటకు కట్టుబడటం ఎంత ఉన్నతమైనదో ఈ ఆవు - పులి నీతి కథ వివరిస్తుంది.

నీతి కథ: రాక్షస గుండె కూడా నిజాయితీకి కరగాల్సిందే..!
Cow And Tiger Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jun 15, 2026 | 4:46 PM

Share

నీతి కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. వాటిలో జీవితాన్ని మార్చే విలువైన పాఠాలు దాగి ఉంటాయి. పిల్లలకు మంచి ప్రవర్తన, నైతిక విలువలను నేర్పించడానికి ఈ నీతి కథలు ఎంతో దోహదపడతాయి. మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటే దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అలా నిజాయితీ ఎంత ఉన్నతమైన గుణమూ గుండెలకు హత్తుకునేలా వివరించే అద్భుతమైన నీతి కథల్లో ఒకటి “ఆవు – పులి కథ”. ఈ కథ నిజాయితీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మంచితనం వంటి గొప్ప విలువలను మనకు నేర్పుతుంది.

కథ

అనగనగా ఒక దట్టమైన అడవిలో పెద్ద పులి నివసించేది. ఒక రోజు దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఆహారం కోసం అడవంతా వెతుకుతూ తిరుగుతుండగా.. ఒక పచ్చిక బయలులో ప్రశాంతంగా మేత మేస్తున్న ఆవు కనిపించింది. ఆవును చూసిన పులి మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది. “ఈరోజు నా ఆకలి తీరిపోతుంది” అని అనుకుని పులి దాని వైపు వెళ్లింది. పులిని చూసిన ఆవు ఒక్కసారిగా భయపడిపోయింది. కానీ వెంటనే తన ఇంట్లో ఉన్న చిన్న లేగదూడ దానికి గుర్తుకు వచ్చింది.

ఆవు ధైర్యం తెచ్చుకుని పులితో ఇలా వేడుకుంది..”నాకు చిన్న దూడ ఉంది. అది ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. నేను వెళ్లి దానికి పాలు ఇచ్చి వస్తాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చి మీ ముందే నిలబడతాను. అప్పుడు మీరు నన్ను ఆహారంగా స్వీకరించండి. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి.”

ఇవి కూడా చదవండి

ఆవు మాటల్లోని నిజాయితీ ఉందని భావించి పులి కాసేపు ఆలోచించింది. చివరకు దానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. పులి అనుమతి ఇవ్వగానే ఆవు వేగంగా ఇంటికి చేరుకుంది. తన దూడకు కడుపునిండా పాలిచ్చింది. మంచి మాటలు చెప్పి, దాని సంరక్షణ బాధ్యతను ఇతర పశువులకు అప్పగించింది. ఆ తర్వాత ప్రాణాలపై ఆశ పెట్టుకోకుండా, పులికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మళ్లీ అడవిలోని పులి దగ్గరకు చేరుకుంది.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆవు నిజంగానే తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మాట నిలబెట్టుకున్న ఆవు నిజాయితీ దానిని కదిలించింది. పులి ఆవుతో ఇలా అంది.. “నీ నిజాయితీ, నీ మాట నిలబెట్టుకునే గుణం నన్ను ఎంతో మెప్పించాయి. నీలాంటి గొప్ప మనసున్న జీవిని నేను చంపలేను. వెళ్లి నీ బిడ్డతో సంతోషంగా జీవించు.”

ఆవు నిజాయితీని మెచ్చిన పులి.. దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా క్షమించి పంపించింది. పులికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన దూడ వద్దకు చేరుకుని సంతోషంగా జీవించింది.

నీతి

మన నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంతో గొప్ప గుణం. నిజాయితీ, మంచితనం, విశ్వాసం వంటి విలువలు మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. మనం మంచిగా ఉంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మంచిగా స్పందిస్తుందనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. ఎంత కరుడుగట్టిన వారి హృదయాన్నైనా కరిగించే శక్తి మనలోని నిజాయికి ఉంటుందని ఈ కథ వివరిస్తుంది.

నేటి ప్రపంచంలో మనుషుల్లో నిజాయితీ తగ్గిపోతున్నట్లు అనిపించినా, అది ఎప్పటికీ అమూల్యమైన గుణమే. కపటం లేకుండా, మాట తప్పకుండా జీవించే వారిని సమాజం గౌరవిస్తుంది. ఆవు – పులి కథ మనకు అదే జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది.

Also Read: పాము–ఎలుక స్నేహం.. బద్ధ శత్రువులు ఫ్రెండ్స్ ఎలా అయ్యాయి..?

Follow Us
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర