AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot Water: కొత్త సమస్యలొస్తాయ్.. ఇలాంటి వారు పొరపాటున కూడా వేడి నీళ్లు తాగకూడదు..

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఏ విధంగా తినాలి..? తాగాలి..? అనే వాటిపై స్పృహను కలిగి ఉంటున్నారు.. ముఖ్యంగా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు మనం తరచుగా వేడి నీటిని తాగుతాము.

Hot Water: కొత్త సమస్యలొస్తాయ్.. ఇలాంటి వారు పొరపాటున కూడా వేడి నీళ్లు తాగకూడదు..
Hot Water
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2025 | 3:52 PM

Share

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఏ విధంగా తినాలి..? తాగాలి..? అనే వాటిపై స్పృహను కలిగి ఉంటున్నారు.. ముఖ్యంగా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఇంకా శీతాకాలంలో మనం తరచుగా వేడి నీటిని తాగుతాము. సాధారణంగా, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ప్రతిరోజూ వేడి నీటిని లేదా గోరు వెచ్చని నీటిని తాగుతారు. వేడి నీటిని తాగడం వల్ల పలు సమస్యల నుంచి బయటపడొచ్చు.. ముఖ్యంగా బరువు తగ్గడంతోపాటు.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఇంకా జలుబు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే.. వేడినీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభించవచ్చు.. కానీ కొంతమంది దీనిని నివారించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే ఇది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.

వేడి నీరు ఎవరు తాగకూడదు..

జలుబు – దగ్గుతో బాధపడుతున్న వారు వేడి నీటిని తాగకూడదు. వేడి నీటిని తాగడం వల్ల వారి గొంతు వాపు – చికాకు పెరుగుతుంది.

వేడి నీరు వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. వారు గోరువెచ్చని నీటిని త్రాగాలి.. ఇది వారి గొంతు ఎండిపోకుండా సహాయపడుతుంది.

చిన్నపిల్లల జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది.. కాబట్టి వారు పెద్దల మాదిరిగా వేడి నీటిని తాగకూడదు.

వేడి నీళ్లు తాగడం వల్ల వారి కడుపుకు హాని కలుగుతుంది. ఇప్పటికే కడుపు సమస్యలున్న వారు సాధారణ నీళ్లు తాగాలి.. లేకుంటే, ఇంకా అనేక కడుపు సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

కాలేయ వ్యాధితో బాధపడేవారు వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

కాలేయం చాలా సున్నితమైన అవయవం.. వేడి నీరు తాగడం వల్ల.. శరీరంలోని వివిధ విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

సున్నితమైన చర్మం ఉన్నవారికి వేడి నీరు మంచిది కాదు. సాధారణ నీటిని మాత్రమే త్రాగాలి.

చాలా వేడిగా ఉన్న నీరు తాగడం వల్ల అన్నవాహికలోని కణజాలం దెబ్బతినవచ్చు. ఇది నోరు – నాలుకపై కాలిన గాయాలను కూడా కలిగిస్తుంది.

అత్యంత వేడి నీరు రుచి మొగ్గలు కూడా దెబ్బతింటాయి..

అందుకే.. అధిక వేడి నీరు తాగే ముందు దాని ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం చాలా ముఖ్యమని.. గోరు వెచ్చని నీరు సరైన ఎంపిక అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us