కేక్ ల్లో చాలా రకాలున్నాయి. అయితే వీటిల్లో వెనిలా కేక్ పిల్లలు, పెద్దలు ఇష్టపడే క్లాసిక్ కేక్. ఈ కేక్ తయారు చేయడానికి రకరకాలు పద్ధతులున్నాయి. కొంత మంది గుడ్డుని ఉపయోగించి కేక్ ను తయారు చేస్తారు. దీనిని ఇష్టంగా తింటారు కూడా.. అయితే మరికొందరికి కేక్ అంటే ఇష్టం ఉన్నా.. గుడ్డు ఉంది అని తినరు. అలాంటి వారి కోసం ఎగ్ లెస్ కేక్ ని తయారు చేసి ఇవ్వవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్ పద్దతిలో ఎటువంటి కష్టం లేకుండా ఎగ్‌లెస్ కేక్‌ను తయారు చేయవచ్చు. ఈ రోజు వెనిలా ఎగ్‌లెస్ కేక్ తయారీ విధానం తెలుసుకుందాం..
తయారీ విధానం: ముందుగా పాలను తీసుకుకుని అందులో వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టండి. మరొక గిన్నె తీసుకుని ఇప్పుడు నూనె, షుగర్ పౌడర్ ని తీసుకుని.. కొంచెం సేపు మిక్స్ చేసి.. అందులో వెనిగర్ పాలు మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. పాలుగా అయ్యే వరకూ మిశ్రమాన్ని కలిపి అప్పుడు అందులో తీసుకున్న పదార్ధాలను అంటే.. వెనిలా ఎసెన్స్, మైదా, పాల పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, కార్న్‌ఫ్లోర్ జోడించండి. ఇప్పుడు ఈ పిండి మృదువుగా అయ్యేంత వరకూ బాగా కలపండి. ఇప్పుడు ఒక దళసరి గిన్నె తీసుకుని లోపల అంచులకు కొంచెం నూనె రాసి.. బటర్ పేపర్ వేసి అప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి సరి చేసి.. ఓవెన్ లో పెట్టి.. 160 డిగ్రీల వద్ద 25-30 నిమిషాలు పాటు బేక్ చేయండి.
ఒకవేళ ఓవెన్ లేకపోతే కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఇసుక పోసి.. అప్పుడు ఒక గిన్నె పెట్టి దాని మీద కేక్ మిశ్రమం వేసుకున్న గిన్నెను పెట్టండి. కేక్ ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక టూత్ పిక్ ని గుచ్చి చూడండి.. పుల్లకు ఎటువంటి పిండి అంటుకోక పొతే కేక్ ఉడికినట్లు. అంతే టేస్టీ టేస్టీ వెనిలా ఎగ్‌లెస్ కేక్ రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..