Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..

|

Mar 17, 2022 | 11:12 PM

Holi 2022: హోలీ పండుగ రోజు ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. పండుగలు

Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..
Holy Special
Follow us on

Holi 2022: హోలీ పండుగ రోజు ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. పండుగలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే వాటిని జరుపుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మీరు హోలీ పండుగని ఆనందించండి కానీ పర్యావరణానికి హాని చేయకండి. హోలీ పండుగను నీరు, బెలూన్లు, రంగులను ఉపయోగించి జరుపుకుంటారు. అయితే ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పర్యావరణహితంగా హోలీని జరుపుకుంటే మేలు. మీరు సేంద్రియ రంగులను ఉపయోగించి హోలి జరుపుకోవచ్చు. పూర్తిగా రసాయన రహిత రంగులను ఎంచుకోవచ్చు. ఈ రంగులు మీ జుట్టు, చర్మానికి ఎటువంటి హాని కలిగించవు. నిజానికి రసాయనాలు అధికంగా ఉండే రంగులను ఉపయోగించడం వల్ల మీ చర్మంపై మొటిమలు, దద్దుర్లు ఏర్పడతాయి. కాబట్టి సేంద్రియ రంగులతో మాత్రమే హోలీ ఆడండి. సింథటిక్ రంగులు మీ చర్మానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరమని గుర్తుంచుకోండి.

వాటర్ బెలూన్లతో హోలీ ఆడకండి

వాటర్ బెలూన్‌లతో హోలీ ఆడటం మంచిది కాదు. అయితే ప్రతి ఒక్కరూ స్నేహితులు, కుటుంబ సభ్యులపై వాటర్ బెలూన్లు విసిరేందుకు ఇష్టపడుతారు. ఇది పర్యావరణానికి చాలా హానికరం. సరదాగా మనం చేసే పని పర్యావరణానికి హాని కలిగిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బెలూన్లతో హోలీ ఆడకుండా ఉండేందుకు ట్రై చేయండి. కావాలంటే మీరు హోలీ రోజున పూలతో హోలీ ఆడవచ్చు. పూలతో హోలీ ఆడే మజా వేరు. చర్మానికి, పర్యావరణానికి హాని కలగకుండా మీరు ఈ పండుగను జరుపుకోవచ్చు.

పొడి రంగులతో హోలీ ఆడటం నీటిని ఆదా చేయడానికి మంచి మార్గం. ఈ విధంగా మీరు నీటిని కూడా ఆదా చేయగలుగుతారు. దీంతో పాటు రసాయనాల హానికరమైన ప్రభావాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. మీరు రోజువారీ పదార్థాలను ఉపయోగించి రంగులను తయారు చేయవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పసుపు రంగును తయారు చేయడానికి మొక్కజొన్న పిండి, పసుపును ఉపయోగించవచ్చు. మొక్కజొన్న పిండి, గోరింట పొడిని కలిపి మరో రంగుని తయారుచేయవచ్చు. ఈ సంవత్సరం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పర్యావరణ అనుకూలమైన రీతిలో హోలీని జరుపుకోండి. అలాగే అందరికి హోలి శుభాకాంక్షలు.

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

యుక్రెయిన్ యుద్దంలో ఫ్రైడే భేటీ కీలకం.. అగ్రనేతల చర్చలతో యుద్దం ఆగే సంకేతం..మరి పుతిన్ మాటేంటి?

Telangana: అంతా బావే చెశాడు.. మ్యాటర్ తెలిసిన తరువాత ఆ యువతి ఏం చేసిందంటే..