Holi 2024: హొలీ సంబరాలకు రెడీ అవుతున్నారా.. కళ్లు, స్కిన్ సేఫ్ కోసం ఈ టిప్స్‌ని గుర్తుంచుకోండి..

| Edited By: TV9 Telugu

Mar 12, 2024 | 5:42 PM

కొన్నిసార్లు చిన్నచిన్న అజాగ్రత్తల  కారణంగా హోలీ సంబరాలు చెడిపోతాయి. కనుక హోలీ పండుగ మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే కలిగించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తద్వారా మీరు హోలీ ఆడుతున్నప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పని ఉండదు. రంగులతో హోలీ ఆడే ముందు చర్మం బాగా తేమగా ఉండటం ముఖ్యం. తద్వారా చర్మం నుండి రంగు పూర్తిగా తొలగిపోతుంది.

Holi 2024: హొలీ సంబరాలకు రెడీ అవుతున్నారా.. కళ్లు, స్కిన్ సేఫ్ కోసం ఈ టిప్స్‌ని గుర్తుంచుకోండి..
Holi 2024
Image Credit source: unsplash
Follow us on

ప్రతి సంవత్సరం హోలీ పండుగను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. హోలీ పండుగ ఆనందం,  వినోదానికి ప్రసిద్ధి. అందుకే అందరూ హోలీ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ హోలీ పండుగ సంబరాల్లో మునిగిపోవాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న అజాగ్రత్తల  కారణంగా హోలీ సంబరాలు చెడిపోతాయి. కనుక హోలీ పండుగ మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే కలిగించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తద్వారా మీరు హోలీ ఆడుతున్నప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పని ఉండదు.

హోలీ ఆడుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ ఉపయోగించండి: రంగులతో హోలీ ఆడే ముందు చర్మం బాగా తేమగా ఉండటం ముఖ్యం. తద్వారా చర్మం నుండి రంగు పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే పొడి చర్మంపై రంగును జల్లుకుంటే శుభ్ర పరుచుకునే సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రంగులు చర్మంపై ఉండిపోతాయి. కనుక హొలీ ఆడుకునే ముందు చర్మం పొడిగా ఉండకుండా తేమ ఉండేలా మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ వాడాలి. తద్వారా చర్మం తేమగా ఉంటుంది. హోలీ రంగులు సులభంగా శుభ్రం చేసుకోచ్చు.
  2. జుట్టు సంరక్షణ కోసం టోపీ లేదా స్కార్ఫ్: జుట్టును రంగులలో కలిపిన ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షించడానికి తలను స్కార్ఫ్ లేదా క్యాప్‌తో కప్పుకోండి. ఇవి రంగులలో కలిపిన రసాయనాలు జుట్టుకు చేరకుండా నిరోధిస్తుంది.
  3. ఫుల్ స్లీవ్ దుస్తులు: చర్మాన్ని రంగుల నుండి రక్షించుకోవడానికి వాటర్ ప్రూఫ్ లేదా ఫుల్ స్లీవ్ దుస్తులను మాత్రమే ధరించి బయటకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల చర్మం రంగుల నుండి రక్షించబడుతుంది.
  4. కళ్ల జోడు ఉపయోగించడం: కళ్లకు రంగులు, రసాయనాలు వలన ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాలంటే హోలీ రోజున కళ్ల జోడు ధరించాలి. ఇవి కళ్ళను రంగుల నుండి కాపాడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. నీటి బుడగల వినియోగానికి దూరంగా : రంగు నీటితో నిండిన బుడగలు కొన్నిసార్లు చాలా హానికరం. ఈ బెలూన్‌లు ఎవరి ముఖానికి అయినా  దూరం నుంచి తగిలితే కళ్లు, చెవులు దెబ్బతింటాయి. అందువల్ల ఎల్లప్పుడూ వాటర్ బెలూన్‌ల వినియోగానికి దూరంగా ఉండండి. హోలీ రోజున చిన్న పిల్లలను ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వవద్దు.
  7. రసాయనిక రంగులకు దూరంగా: మార్కెట్లో వివిధ రకాల రసాయన రంగుల ప్రాబల్యం పెరిగింది. అయితే ఈ  రంగులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఎల్లప్పుడూ సహజ రంగులతో మాత్రమే హోలీ ఆడండి. రసాయన రంగులు చర్మంతో పాటు కళ్లకు కూడా హాని కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..