
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (హై కొలెస్ట్రాల్) పెరిగినప్పుడు, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని మీకు తెలుసు. మనకు ఉండే కొన్ని ఆహారపు అలవాట్లో ఈ కొలెస్ట్రాల్ మనకు తెలియకుండానే మన శరీరంలో నెమ్మదిగా పేరుకుపోతుంది. దీన్ని ఇలానే వదిలేస్తే దీర్ఘకాలంలో మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అక్కడి వరకు వెళ్లకుండా దీన్ని ముందుగానే గుర్తించి.. పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం. కాబట్టి, శరీరంలో కొలెస్ట్రాల్ ఉందా లేదా? అని కొన్ని చిన్న సంకేతాల ద్వారా మనం దానిని ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకు ఆ లక్షణాలు ఏమిటి? మన బాడీ ఇచ్చే సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
నడుస్తున్నప్పుడు, లేదా కూర్చున్నప్పుడు మీ చేతులు, కాళ్లు ఒక్కసారిగా చల్లగా అనిపించడం జరిగితే మీలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టు అర్థం.
మీకు ఇలా అనిపిస్తే మీరో రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదని అర్థం. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా సాధారణం. మీరు ఎప్పుడైన ఇలాంటి అనుభూతిని పోందినట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
మీ వయస్సు మీద పడకపోయినా.. మీరు తరచూ జ్ఞాపక శక్త లోపంతో బాధపడుతున్నా.. చిన్ని చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నా ఇది అధిక కోలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి మీకు ఎక్కవుగా మతిమరుపు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
సాధారణంగా కళ్ళ చుట్టూ తెలుపు లేదా పసుపు రంగులో మచ్చలు కనిపిస్తే, అది మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌కు ఉన్నట్టు చెప్పడానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా చిన్న వయసులోనే అలాంటి సంకేతాలు కనిపిస్తే, ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. కళ్ళ కింద లేదా కళ్ళ చుట్టూ పసుపు రంగు మచ్చలు కనిపిస్తే, అది మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతున్నట్లు సూచిస్తుంది.
మీరు కొద్ది దూరం నడిచినా, మెట్లు ఎక్కేటప్పుడు ఆలసటగా అనిపించినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే, గుండెపై ఎక్కువ ఒత్తిడి పడినట్టు అనిపించినా అది మీ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు సంకేతం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మీరు రాత్రి బాగా నిద్రపోయినా కూడా రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే, అది మీకు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నాయని సంకేతం కావచ్చు. ఎందుకంటే ఇలా జరిగినప్పుడు, శరీరం సరిగ్గా శక్తిని పొందలేకపోతుంది, దీని వలన శరీరం త్వరగా అలసిపోతుంది. మీకు ఏ పని చేయడానికి కూడా ఎక్కువ శక్తి ఉండదు.
ఇవి మీ శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక సంకేతాలు మాత్రమే. వీటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు వీటిని విస్మరించకూడదు. ఏవైనా ఆరోగ్య సమస్యలే.. కాబట్టి సరైన నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించండి. అంతేకాకుండా మీరు ఆహారపు అలవాట్లలో మెరుగైన వాటిని ఎంచుకోండి. కానీ అలా చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.