Chia Seeds for Skin: చియా సీడ్స్‌ ఇలా తీసుకుంటే.. మీ స్కిన్ మెరిసిపోవడం ఖాయం..!

సమ్మర్‌లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో చియా సీడ్స్ కూడా ఒకటి. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి బాగా తెలుసు. చియా సీడ్స్‌లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కొవ్వులు, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు బి1, బి3, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి చియా సీడ్స్ తీసుకుంటే పలు దీర్ఘకాలిక వ్యాధులను..

Chia Seeds for Skin: చియా సీడ్స్‌ ఇలా తీసుకుంటే.. మీ స్కిన్ మెరిసిపోవడం ఖాయం..!
చియా విత్తనాలు బరువు తగ్గడానికి గ్రేట్‌గా పనిచేస్తాయి. కానీ చియా సీడ్స్ సరైనరీతిలో తినకపోతే బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడం మొదలవుతుంది. 2 టీస్పూన్ల చియా గింజల్లో దాదాపు 138 కేలరీలు ఉంటాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాలను రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర టీస్పూన్లు మాత్రమే తీసుకోవాలి. నీటిలో నానబెట్టి లేదా పాలు, పెరుగులో చియా గింజలను కలుపుకొని తాగవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని తీసుకుంటే ప్రమాదకరమనే విషయం గుర్తుంచుకోండి.

Updated on: May 11, 2024 | 2:45 PM

సమ్మర్‌లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో చియా సీడ్స్ కూడా ఒకటి. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి బాగా తెలుసు. చియా సీడ్స్‌లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కొవ్వులు, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు బి1, బి3, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి చియా సీడ్స్ తీసుకుంటే పలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం కంట్రోల్ చేయవచ్చు. చియా సీడ్స్‌కి శరీరాన్ని చలువ చేసే గుణం ఉంది. కాబట్టి వీటిని ఇతర కాలల కంటే.. ఎండా కాలంలోనే ఎక్కువగా తీసుకుంటారు. కానీ వీటితో అందం కూడా రెట్టింపు అవుతుందన్న విషయం మీకు తెలుసా? అవును చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మీ చర్మం అందంగా తయారవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది:

తరచూ చియా సీడ్స్‌ని కొద్ది మోతాదులో నానబెట్టుకుని తీసుకుంటే.. ఆరోగ్యంతో పాటు అందం కూడా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే చియా సీడ్స్‌లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీనే కాకుండా చర్మాన్ని కూడా హైడ్రేట్‌గా ఉంచుతుంది. మీరు నేచురల్‌గానే కాంతివంతంగా కనిపిస్తారు. స్కిన్‌కి మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది.

మృత కణాలను తొలగిస్తుంది:

చియా సీడ్స్‌ని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా శరీరంపై ఉండే మంట, దురదను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, స్కిన్‌టోన్‌ని మెరుగు పరుస్తుంది. చియా సీడ్స్.. స్కిన్‌కి ఒక నేచురల్ ఎక్స్ ఫోలియేటర్‌గా పని చేస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలకు చెక్:

ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే ప్రాడెక్ట్స్‌ని ఉపయోగిస్తారు. కానీ చియా సీడ్స్‌తో కూడా మీరు పింపుల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. మీరు తరచూ చియా సీడ్స్‌ని తీసుకున్నా, ప్యాక్స్ రూపంలో వేసుకున్నా మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు.

చియా సీడ్స్ ప్యాక్:

చియా సీడ్స్‌తో మంచి ప్యాక్ వేసుకోవాలని చూస్తున్నారా. ఇది మీకోసమే. ఓ రెండు స్పూన్ల చియా సీడ్స్‌ని తీసుకుని వీటిని పాలతో అయినా, నీటితో అయినా మిక్సీ పట్టి.. పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖం, మెడ, చేతులకు అప్లూ చేస్తే.. లోపల నుంచి చర్మానికి పోషణ అంది.. మెరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..