IRCTC Tours: మధ్యప్రదేశ్‌లోని మహా క్షేత్రాలు ఇవి.. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..

దేశానికి మధ్య ప్రాంతం.. ఎక్కువ సంఖ్యలో అడవులు, వారసత్వ కట్టడాలు, ఆధునిక హంగులతో నగరాలు, గొప్ప దేవాలయాలు కొలువుదీరిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో పర్యటన ఔత్సాహికులకు మధురానుభూతిని మిగుల్చుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే వారికి. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ మన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహిస్తోంది.

IRCTC Tours: మధ్యప్రదేశ్‌లోని మహా క్షేత్రాలు ఇవి.. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..
Ujjain Temple, Madyapradesh

Updated on: Sep 08, 2023 | 8:30 AM

దేశానికి మధ్య ప్రాంతం.. ఎక్కువ సంఖ్యలో అడవులు, వారసత్వ కట్టడాలు, ఆధునిక హంగులతో నగరాలు, గొప్ప దేవాలయాలు కొలువుదీరిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో పర్యటన ఔత్సాహికులకు మధురానుభూతిని మిగుల్చుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే వారికి. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ మన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్ మహా దర్శన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్యాకేజీలో నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉంటుంది. విమానంలో తీసుకెళ్లి తీసుకొచ్చే ఈ ప్యాకేజీ ధరలు రూ. 22,400 నుంచి ప్రారంభమవుతాయి. ఈ టూర్‌ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ ప్రాంతాలు కవర్‌ అవుతాయి. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ మధ్యప్రదేశ్‌ మహా దర్శన్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

టూర్‌ వివరాలు ఇవి..

  • పేరు: మధ్యప్రదేశ్ మహా దర్శన్‌(ఎస్‌హెచ్‌ఏ15)
  • వ్యవధి: నాలుగు రాత్రులు ఐదు పగళ్లు
  • ప్రయాణ సాధనం: హైదరాబాద్‌ నుంచి విమానంలో..
  • ప్రయాణ తేదీ: 2023, నవంబర్‌ 22
  • కవరయ్యే ప్రాంతాలు: ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్

పర్యటన సాగుతుందిలా..

డే1(హైదరాబాద్-ఇండోర్ – ఉజ్జయిని): హైదరాబాద్ నుంచి ఇండోర్‌ విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం ఇండోర్ విమానాశ్రయంలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకొని, ఉజ్జయినికి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్‌ ఇన్ అ‍య్యాక.. ఆలయం లేదా పరిసరాలను సందర్శించవచ్చు. ఉజ్జయినిలోనే రాత్రి బస ఉంటుంది.

రోజు2(ఉజ్జయిని): హోటల్‌లో అల్పాహారం చేశాక ఉజ్జయిని స్థానిక దేవాలయాలైన హర్సిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు. రాత్రి భోజనం చేశాక ఉజ్జయినిలోనే బస చేస్తారు.

ఇవి కూడా చదవండి

డే3(ఉజ్జయిని – మండు – ఓంకారేశ్వర్): ఉదయాన్నే కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మండుకు బయలుదేరుతారు. మండు ఫోర్ట్, జహాజ్ మహల్ సందర్శిస్తారు. మధ్యాహ్నం మహేశ్వర్‌కు బయలుదేరుతారు. అహల్యా దేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శిస్తారు. తర్వాత ఓంకారేశ్వర్‌కు వెళ్లి డిన్నర్‌ చేసి అక్కడే బస చేస్తారు.

రోజు4(ఓంకారేశ్వర్- ఇండోర్): హోటల్‌లో అల్పాహారం చేశాక ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి ఇండోర్‌కు బయలుదేరి పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇండోర్‌లోనే రాత్రిభోజనం చేసి బస చేస్తారు.

డే5(ఇండోర్ – హైదరాబాద్): హోటల్‌లో అల్పాహారం చేశాక అన్నపూర్ణ మందిర్, లాల్ బాగ్ ప్యాలెస్‌ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ కు తిరుగు పయనమవుతారు. దీంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

విమానంలో వెళ్లి వచ్చే టూర్‌ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి.. హోటల్‌ రూం ప్రత్యేకంగా ఒక వ్యక్తికి కావాలంటే రూ. 29,100 చార్జ్‌ చేస్తారు. అదే హోటల్‌ రూంని ఇద్దరు షేర్‌ చేసుకుంటే ఒక్కొక్కరికీ రూ. 23,300, ముగ్గురు షేర్‌ చేసుకుంటే ఒక్కొక్కరికీ రూ. 22,400 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్‌ అవసరం అయితే రూ. 20650, బెడ్‌ అవసరం లేకపోతే రూ. 18550 తీసుకుంటారు. రెండేళ్ల నుంచి నాలుగేళ్ల చిన్నారులకు ప్రత్యేక బెడ్‌ లేకుండా రూ. 14950 చార్జ్‌ చేస్తారు.

ప్యాకేజీలో ఇవి కవర్‌ అవుతాయి..

విమాన టికెట్లు (హైదరాబాద్ – ఇండోర్ – హైదరాబాద్) ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. 4 అల్పాహారాలు, 4 రాత్రి భోజనాలు అందిస్తారు. లోకల్లో ప్రయాణాల కోసం ఏసీ టెంపో ట్రావెలర్‌ సమకూర్చుతారు. ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సదుపాయం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్‌ సేవలు లభ్యమవుతాయి. కాగా మధ్యాహ్న భోజనంతో పాటు విమానంలో ఆహారం, స్థానిక ఆలయాల్లో దర్శన టికెట్లను పర్యాటకులే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారిక వెబ్‌ సైట్లోకి వెళ్లి, దానిలో టూర్‌ ప్యాకేజెస్‌ సెక‌్షన్లో మధ్య ప్రదేశ్‌ మహా దర్శన్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..