Protein Rich Foods: గర్భిణులు అధిక ప్రోటీన్లతో కూడిన ఈ ఆహారాన్ని తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

|

Jun 29, 2023 | 12:25 PM

గర్భంలో పెరుగుతున్న శిశువు అవయవాలు, కండరాలకు అనేక రకాల ప్రోటీన్లు అవసరం అవుతాయి. ఆ ప్రోటీన్లు సహజంగా ఆ శిశువుకు అందాలంటే అధిక ప్రోటీన్లు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

Protein Rich Foods: గర్భిణులు అధిక ప్రోటీన్లతో కూడిన ఈ ఆహారాన్ని తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Pregnant women diet
Follow us on

మాతృత్వం అనేది ప్రతి మహిళ కోరుకునే ఓ మధురమైన భావన. అది వారికి ఓ పునర్జమ్మ వంటిదని తెలిసినా ప్రతి మహిళ దానిని ఇష్టపూర్వకంగానే కోరుకుంటుంది. ఆ ప్రసవ వేదనను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణాన్ని భూమి మీదకు తెలుస్తుంది. ఆ ప్రక్రియను ప్రతి మహిళ ఆస్వాదిస్తుంది. అయితే గర్భవతి అయినది మొదలు కొని కొన్ని ప్రత్యేక విధానాలను మహిళలకు ఆపాదిస్తారు. అది తినాలి, ఇది తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటూ అనేక రకాల నియమాలు, సూచనలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలోనూ ఇదే తరహా నిబంధనలు పెడుతుంటారు. అయితే నిజంగా గర్భిణులు ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న విషయంలో సొంత నిర్ణయాల కన్నా.. నిపుణుల సూచనలు తీసుకోవడం చాలా ఉత్తమం. గర్భంలో పెరుగుతున్న శిశువు అవయవాలు, కండరాలకు అనేక రకాల ప్రోటీన్లు అవసరం అవుతాయి. ఆ ప్రోటీన్లు సహజంగా ఆ శిశువుకు అందాలంటే అధిక ప్రోటీన్లు, పోషకాలతో కూడిన ఆహారం  తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రముఖ చైల్డ్ న్యూట్రిషన్ మోనా నరులా గర్భంలోని శిశువు ఎదుగుదలకు సహకరించే అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు. తన ఇన్ గ్రామ్ వేదికగా వాటిని పోస్ట్ చేశారు. గర్భిణులు తమ డైలీ డైట్ లో ఇవి చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రోటీన్లు చాలా అవసరం..

గర్భిణులకు అధిక ప్రోటీన్లతో కూడిన ఆహారం అవసరం. ఎందుకంటే గర్భంలోని శిశువు కణజాలం, అవయవాలు, కండరాలు ఏర్పడే సమయంలో ప్రోటీన్లు సహాయ పడతాయి. అలాగే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి పాలు ఎక్కువగా ఉండేందుకు సహాయ పడుతాయి. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు, బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో గర్భిణులకు సాయం చేసే ఆ అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం గురించి డాక్టర్ మోనా తన పోస్ట్ సూచించిన అంశాలను ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

పనీర్.. కాబోయే తల్లులకు సులభంగా జీర్ణమయ్యే శాకాహార ప్రోటీన్ ఇది. అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను సరైన నిష్పత్తిలో కలిగి ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. కాల్షియం, భాస్వరం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది శిశువు యొక్క దంతాలు, ఎముకల పెరుగుదల, అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నాడీ వ్యవస్థ పనితీరు కోసం విటమిన్ బీ12, కాల్షియం, విటమిన్ డీ కలిగి ఉంటుంది.

గుర్రపు పప్పు (కుల్తీ పప్పు).. గుర్రపు పప్పులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. హార్స్‌గ్రామ్‌లో డైటరీ ఫైబర్ , ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు మద్దతునిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. గర్భధారణ సమయంలో మొత్తం తల్లి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

వేరుశెనగలు.. దీనిలో ప్రొటీన్ అర్జినైన్ ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో పిండం పెరుగుదల, తల్లి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వారు ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన ఇతర ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కూడా అందిస్తుంది.

అయితే గర్భిణులు ఏదైనా ఆహారాన్ని తీసుకునే ముందు, లేదా ఆహార మర్పులు చేసే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలని కూడా ఆమె పేర్కొన్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..