ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..? ఈ 15 బ్రహ్మస్త్రాలను పాటించండి చాలు..
ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. పేలవమైన జీవినశైలిని అవలంభించడం.. ఇలా చాలామంది ఊబకాయం సమస్య బాధపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన.. బరువు పెరగడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంటి (వర్క్ ఫ్రమ్ హోం) నుంచి పని చేయడం వల్ల ఈ సమస్య మరింత పెరిగిందని నిపుణులు పలు అధ్యయానాల్లో వివరించారు.

ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. పేలవమైన జీవినశైలిని అవలంభించడం.. ఇలా చాలామంది ఊబకాయం సమస్య బాధపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన.. బరువు పెరగడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంటి (వర్క్ ఫ్రమ్ హోం) నుంచి పని చేయడం వల్ల ఈ సమస్య మరింత పెరిగిందని నిపుణులు పలు అధ్యయానాల్లో వివరించారు. ముఖ్యంగా 2020 నుంచి యువకులు చాలామంది ఊబకాయం బారిన పడ్డారు. బరువు తగ్గడం అనేది చాలా కఠినంగా జరిగే ప్రక్రియ.. కఠినమైన ఆహారం, భారీ వ్యాయామం అవసరం. కానీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు పొట్ట, నడుము కొవ్వును తగ్గించలేకపోతే, మీరు ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.. ఆ రోజువారీ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే పెరిగిన పొట్ట తగ్గుతుంది..
బరువు తగ్గడానికి ఉత్తమమైన 15 మార్గాలు ఇవే..
- బరువు తగ్గడానికి డైటింగ్ మాత్రమే సరిపోదు.. దీని కోసం సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ముఖ్యం.
- ప్రొటీన్లు పుష్కలంగా ఉండే వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి.
- ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ అలవాటును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలకు బదులు ఉడకబెట్టిన, కాల్చిన ఆహారాన్ని తినాలి.
- ఆల్కహాల్ మీ ఆరోగ్యానికి హానికరం, దానికి ఎప్పటికీ దూరంగా ఉండండి.
- శీతల పానీయాలు, ఐస్ క్రీం తినే అలవాటును మానేయండి.
- చక్కెర లేదా తీపి పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయి. ముఖ్యంగా వీటికి దూరంగా ఉండండి.
- మీ డైలీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. ఇది మీకు ఎక్కువ కాలం ఆకలిగా అనిపించకుండా చేస్తుంది.
- గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం ప్రారంభించండి. ఎందుకంటే వాటిలో కేలరీలు ఉంటాయి.
- రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం.
- త్రాగునీటిని నిర్లక్ష్యం చేయవద్దు.. ఇది జీవక్రియను పెంచుతుంది.
- మీకు మంచి ఫలితాలు కావాలంటే గోరువెచ్చని నీటిని తాగండి.
- గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోండి.
- అల్పాహారం కోసం ఓట్స్, క్వినోవా తినండి. రోజువారీ వ్యాయామాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




