Vomiting Sensation While Brushing: బ్రష్ చేసే సమయంలో వాంతులు అవుతున్నాయా? జాగ్రత్త.. లైట్‌ తీసుకోకండి..

|

May 13, 2024 | 12:33 PM

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం బ్రష్ చేయాలి. దీని వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నోటి భాగం మొత్తం శుభ్రపడుతుంది. చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. కానీ చాలా మందికి పళ్ళు తోముకునేటప్పుడు వికారంగా ఉండటం, వాంతులు వంటివి అవుతుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బ్రష్ చేసేటప్పుడు వాంతులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు..

Vomiting Sensation While Brushing: బ్రష్ చేసే సమయంలో వాంతులు అవుతున్నాయా? జాగ్రత్త.. లైట్‌ తీసుకోకండి..
Vomiting Sensation While Brushing
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం బ్రష్ చేయాలి. దీని వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నోటి భాగం మొత్తం శుభ్రపడుతుంది. చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. కానీ చాలా మందికి పళ్ళు తోముకునేటప్పుడు వికారంగా ఉండటం, వాంతులు వంటివి అవుతుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బ్రష్ చేసేటప్పుడు వాంతులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

పళ్ళు తోముకునేటప్పుడు వాంతులు రావడానికి గల ప్రధాన కారణాలు

మూత్ర నాళ వ్యాధి

కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. నేలి కాలంలో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. శరీరంలో మూత్ర గ్రంధులు పనిచేయకపోతే పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీంతో ఉదయం పళ్లు తోముకునేటప్పుడు వికారం, వాంతులు అవుతాయి. వాంతి సమయంలో కడుపులో నొప్పి, తిమ్మిరి ఉంటుంది. మీకు కూడా ఇలా అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

అల్సర్

చాలా మందికి నోటిపూత కూడా ఉంటుంది. అయినా కొంతమంది పట్టించుకోరు. ఎంత మందికి అల్సర్లు ఉన్నాయో కూడా తెలియదు. అల్సర్ సమస్య ఉంటే పళ్లు తోముకునేటప్పుడు వాంతులు అవుతాయి. ఇలా తరచూ వాంతులు చేసుకుంటుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

కాలేయ సమస్య

కాలేయ సమస్యలున్న వారిలో కూడా ఉదయం పళ్ళు తోముకునేటప్పుడు వికారం, వాంతులు అవుతాయి. కాబట్టి దీన్ని తేలికగా తీసుకోకూడదు.

పిత్త సమస్య

పళ్లు తోముకునేటప్పుడు వాంతులు, వికారం వస్తే అది పైత్య సమస్య వల్ల కూడా అయిండొచ్చు. శరీరంలో పైత్యరసం పెరగడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. దీంతో బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతాయి. ఇలా తరచూ వాంతులు చేసుకుంటుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.