AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra water with honey: రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తేనె కలిపి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

కురగాయాల్లో బెండకాయ ఒకటి. దీనిలో అనేక పోషకాలున్నాయి. ఇది శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి రెండింటికీ మంచిది. బెండకాయ నీటిని ఉదయం తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వస్తుంది. ఈ రోజు తేనెతో కలిపిన బెండకాయ నీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంలో కలిగే మార్పులు ఏమిటో తెలుసుకుందాం..

Okra water with honey: రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తేనె కలిపి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే, ఏడు రోజుల్లో బరువు తగ్గడం ఖాయం. బెండ బరువును తగ్గించడమే కాకుండా, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది చర్మం పొడిబారడాన్ని కూడా తొలగిస్తుంది.
Surya Kala
|

Updated on: May 01, 2025 | 8:28 PM

Share

బెండకాయ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం. మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే చెడు మూలకాలను తొలగించే శక్తి దీనికి ఉంది. బెండకాయ నీటిని తాగడం వల్ల ఆరోగ్యంలో మరిన్ని మార్పులు వస్తాయి. అయితే బెండకాయ నీటిలో తేనెతో కలిపి త్రాగడం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ప్రధానంగా ఉదయం సమయంలో ఈ నీటిని తీసుకోవడం మంచిది. మీరు ప్రతిరోజూ ఇలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం..

తేనెతో కలిపి బెండకాయ నీరు తాగడం మంచిది. ఇది ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండింటి ద్వారా సాంప్రదాయ నివారణగా నిరూపించబడిందని పోషకాహార నిపుణుడు, వెల్నెస్ కోచ్ ఇషా లాల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పంచుకున్నారు.

తేనెతో బెండకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పేగు ఆరోగ్యం, మెరుగైన జీర్ణక్రియ: బెండకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. దీంతో బెండకాయలను నీటిలో నానబెట్టినప్పుడు ఇది జెల్ లాంటి స్థిరత్వాన్ని సృష్టిస్తుంది. ఇది పేగు లైనింగ్‌లోని సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: బెండకాయ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బెండకాయలో ఉండే మైరిసెటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది: బెండకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మం ముడతలను తగ్గిస్తాయి. తేనె సహజమైన హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపుని ఇస్తుంది.

బరువు నిర్వహణ: బెండకాయ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల దాని ఫైబర్ కంటెంట్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంటుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఉదయం తేనెతో కలిపి తీసుకుంటే జీవక్రియను పెంచుతుంది.

గుండె ఆరోగ్యం: బెండకాయ రసం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బెండకాయ ..తేనె రెండూ మంటను తగ్గిస్తాయి. తేనెలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. తేనెలో యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)