Acidity: గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

|

Oct 18, 2023 | 8:23 PM

నేటి గజిబిజి జీవనశైలి కారణంగా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. తినడానికి, నిద్రపోవడానికి సరైన సమయం దొరకక పోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిద్ర, తిండి విషయంలో అశ్రద్ధ వహిస్తే ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటిని అధిగమించాలంటే ఉదయం వేళ కనీసం 20-25 నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో..

Acidity: గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..
Acidity
Follow us on

నిత్యం బయటి ఆహారాలు తినడం వల్ల గ్యాస్‌, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గ్యాస్ వల్ల గుండెల్లో మంట తలెత్తి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక మటన్, చికెన్‌ వంటి మాంసాహారాలు తింటే పొట్ట ఉబ్బి త్రేపులతో బాధపడిపోతుంటారు. ఇలా ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజు వారీ జీవన విధానంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల మాటల్లో మీ కోసం..

వ్యాయామం

నేటి గజిబిజి జీవనశైలి కారణంగా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. తినడానికి, నిద్రపోవడానికి సరైన సమయం దొరకక పోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిద్ర, తిండి విషయంలో అశ్రద్ధ వహిస్తే ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటిని అధిగమించాలంటే ఉదయం వేళ కనీసం 20-25 నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వేళకు తినండం మర్చిపోకూడదు

ఆకలి అనిపించినప్పుడు చుట్టు పక్కల దొరికే చిరుతిళ్లు తినడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా బయట దొరికే ఆహారాలు అనారోగ్యకరమైనవి. వీటిని తినడం పూర్తిగా మానుకోవాలి. సోడా పానీయాలు, మసాలా, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర కలిగిన ఆహారాలు గ్యాస్-గుండె మంట సమస్యలను తీవ్రతరం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రోబయోటిక్స్‌ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చుకోవాలి. ప్రోబయోటిక్స్ పేగుల పనితీరును సక్రమంగా నిర్వహించడానికి సహాయపడతాయి. ప్రోబయోటిక్స్‌ పెరుగులో అధికంగా ఉంటాయి. రోజూ ఆహారంలో పెరుగు తింటే అందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మెంతులు-జీలకర్ర నీరు

మెంతులు-జీలకర్ర వేసి నానబెట్టిన నీళ్లు ఎసిడిటీ, జీర్ణ సమస్యల నుంచి కాపాడుతాయి. మెంతుల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెల్లం, జీలకర్రను వేడి నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టి.. ఈ నీటిని వడకట్టి మరుసటి రోజు ఉదయం తాగితే సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.

అధికంగా నీళ్లు తాగాలి

ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా సరిపడా నీళ్లు లేకపోవడం వల్ల శరీరంలో ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నీళ్లు తాగక పోవడం వల్ల గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అధికంగా నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.