
చిరు ధాన్యాల్లో ఒకటి మిల్లెట్స్. ఇది చిన్న గింజలతో కూడిన ఒక రకమైన ధాన్యం. దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. తినే ఆహారంలో చేర్చుకుంటారు. భారతదేశంలో మిల్లెట్స్ తో రకరకాల ఆహారాన్ని తయారు చేస్తారు. రొట్టి, గంజి వంటి వాటిని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ తృణధాన్యంతో చేసిన పాలను కూడా ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని తెలుసా. ఇది ఒక రకమైన డైరీ-ఫ్రీ మిల్క్. ఇందులో ప్రోటీన్, అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు ఇది గ్లూటెన్ ఫ్రీ పాలు. అటువంటి పరిస్థితిలో డైరీ ఫ్రీ, ఆవు పాలకు అలెర్జీ, శాకాహారి ఆహారం తినే వారికి ఈ మిల్లెట్ పాలు మంచి ఎంపికగా నిరూపించబడుతుంది.
ఈ పాలల్లో మిల్లెట్ మిల్క్, ప్రోసో మిల్లెట్ మిల్క్, ఫాక్స్‌టైల్ మిల్లెట్ మిల్క్ మరియు బ్రౌన్‌టాప్ మిల్లెట్ మిల్క్ వంటి అనేక రకాలు ఉన్నాయి. అయితే చూడడానికి ఈ మిల్లెట్ పాలు బాదం లేదా సోయా మిల్క్ లాగా సులభంగా మార్కెట్లో అందుబాటులో ఉండదు.
మనం ఉపయోగించే పాల ఉత్పత్తులతో పోల్చి చూస్తే, మిల్లెట్ పాలు రుచి, ఆకృతి రెండూ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కొంతమంది దాని రుచిని మట్టి లేదా వగరుగా ఉంటాయని వర్ణిస్తారు.
వాస్తవానికి మిల్లెట్ పాలను తాగడానికి కొని పద్దతులున్నాయి. చాలా మందికి ఈ పాలను తాగడం వలన కడుపు సంబంధిత లేదా ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. కనుక ఈ పాలను నెమ్మదిగా తాగడం ప్రారంభించండి. మీ శరీరం దానిని త్రాగడానికి ఎలా స్పందిస్తుందో కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ మిల్లెట్ పాలు తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.