భారతదేశంలో కాఫీ ప్రియుల సంఖ్య చాల ఎక్కువగానే ఉంటుంది.. పొద్దున్నే నిద్ర లేవగానే కప్పు కాఫీ, టీ తాగందే ఏ పని చేయనివారు కూడా ఉంటారు. అయితే, కాఫీని మితంగా తాగితేనే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు కాఫీపై మరో అధ్యయనం జరిగింది.. కాఫీ ప్రియులకు, రోజూ కాఫీ తాగందే ఉండలేని వారికి ఈ అధ్యయనం ఒక శుభవార్త అందించింది. ప్రస్తుతం మన జీవన విధానం చాలా మారిపోయింది. ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత బరువు కంట్రోల్‌లో ఉంటుంది. శరీరంలో కొలస్ట్రాల్, బరువును నియంత్రించడానికి మీరు వివిధ వ్యాయామాలు చేయాలి. ఏదైనా ఆహారం తీసుకునే ముందు, అది బరువు పెంచుతుందా..? లేదా అనేది తెలుసుకోవాలి. కాఫీలో కెఫిన్ ఉండటం వల్ల కాఫీ ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది అనుకుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనం ఆసక్తికర విషయం చెప్పింది. మీరు రోజుకు ఒక కప్పు అదనంగా కాఫీ తాగితే, మీరు బరువు పెరగరు. మీరు మీ బరువును నియంత్రించుకోవడానికి అదనంగా కాఫీ తీసుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాలి.
కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారా?.. అవుననే అంటున్నారు పరిశోధకులు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారు కాఫీ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అదనంగా కాఫీ తాగుతున్నప్పుడు చక్కెర లేదా క్రీమ్ వంటివి వాడరాదు. అదనంగా చక్కెర, క్రీమ్ కలపకుండా అదనంగా కాఫీ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ వల్ల బరువు తగ్గుతున్నారని పరిశోధకులు గుర్తించారు. రోజుకు ఒక కప్పు అదనంగా కాఫీ తాగే వారు నాలుగేళ్లలో 0.12 కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ కాఫీలో పంచదార కలుపుకుని తాగితే బరువు పెరుగుతారు.
దీని గురించి మూడు పరిశోధనలు జరిగాయి: 1986 నుండి 2010 వరకు, 1991 నుండి 2015 వరకు, పరిశోధకులు ఆరోగ్య అధ్యయనాలు నిర్వహించారు. ఇందులో 2.3 లక్షల మంది నర్సులు పాల్గొన్నారు. 1991 నుండి 2014 వరకు నిర్వహించిన మరో అధ్యయనంలో 50,000 మంది పురుషులు పాల్గొన్నారు. ఆ రెండు పరిశోధనల డేటా ధృవీకరించబడింది. నర్సులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, కాఫీ తాగే నర్సులు ప్రతి నాలుగేళ్లకు 1.2 నుండి 1.7 కిలోల వరకు పెరుగుతారని గుర్తించారు.
పురుషులను కూడా అదే ప్రశ్న అడిగారు. పరిశోధన ముగింపులో అదనపు కాఫీ తాగడం వల్ల బరువు పెరగరని, చక్కెర వేసిన కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారని కనుగొన్నారు పరిశోధకులు. కాఫీని పాలతో కలిపి సేవించినా నష్టం లేదు. కానీ చక్కెర మీ బరువును 0.09 కిలోలు పెంచుతుంది. కెఫిన్ ఒక సహజ ఉద్దీపన. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కెఫీన్ జీవక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..