
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం టీ తాగుతారు. కొందరు బ్లాక్ టీని ఇష్టపడతారు. మరి కొందరు మిల్క్ టీని ఇష్టపడతారు. మరికొందరు మసాలా టీని పిచ్చిగా ఇష్టపడతారు. టీ కంటే లెమన్ టీ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు లెమన్ టీకి ప్రియారిటీ ఇస్తారు. అయితే.. ప్రతి రోజూ లెమన్ టీ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ టీ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు? అవేంటో వివరంగా తెలుసుకుందాం..
లెమన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటి నొప్పి సమస్య ఉన్నవారు లెమన్ టీ తాగవద్దు అంటున్నారు నిపుణులు లెమన్ టీలో ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాదు.. గుండెల్లో మంట, వాపు, మలబద్ధకం, ఆమ్ల రిఫ్లక్స్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని సూచిస్తున్నారు.
లెమన్ టీలో ఉండే కెఫీన్ మూత్రవిసర్జన ను ప్రభావితం చేస్తుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. నిమ్మకాయలు అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి కాలక్రమేణా దంతాల ఎనామిల్‌ను కోతకు గురిచేస్తాయి. దీనివల్ల దంతాలు సున్నితంగా మారతాయి.
టీలో టానిన్లు ఉంటాయి. కాబట్టి, ఖాళీ కడుపుతో నిమ్మ టీ తాగితే ఐరన్, ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. అలాగే.. లెమన్ టీలో కెఫిన్ ఉండటం వల్ల కొంతమందికి ఆందోళన, వణుకు, నిద్రలేమి వంటివి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగితే కొంతమందికి కడుపు నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..