AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాటి బెల్లం..ఆరోగ్యానికి చేస్తుంది ఎంతో సాయం!

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా వెచ్చించేందుకు…ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్దమవుతున్నాడు. కారణం నిత్యజీవితంతో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండటమే. అయితే మనిషిని ఆరోగ్యంగా ఉంచాలన్నా…అనారోగ్యం పాలు చెయ్యాలన్నా ఆ శక్తి ఆహార పదార్థాలకు ఉంది.శరీరానికి హాని చేసేవి తింటే రోగాలు…మేలు చేసేవి భుజిస్తే ఆరోగ్యమూ సంప్రాప్తించడమూ సహజమే. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.  మేలు చేసే ఆహార పదార్థాల్లో తాటి బెల్లం ఒకటి. ఈ విషయాన్ని పూర్వీకుల నుంచి […]

తాటి బెల్లం..ఆరోగ్యానికి చేస్తుంది ఎంతో సాయం!
Ram Naramaneni
|

Updated on: Oct 04, 2019 | 8:02 PM

Share

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా వెచ్చించేందుకు…ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్దమవుతున్నాడు. కారణం నిత్యజీవితంతో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండటమే. అయితే మనిషిని ఆరోగ్యంగా ఉంచాలన్నా…అనారోగ్యం పాలు చెయ్యాలన్నా ఆ శక్తి ఆహార పదార్థాలకు ఉంది.శరీరానికి హాని చేసేవి తింటే రోగాలు…మేలు చేసేవి భుజిస్తే ఆరోగ్యమూ సంప్రాప్తించడమూ సహజమే. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.  మేలు చేసే ఆహార పదార్థాల్లో తాటి బెల్లం ఒకటి. ఈ విషయాన్ని పూర్వీకుల నుంచి నేటి కాలం వరకూ అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. తాటి బెల్లం విశిష్టత గురించి 100 సంవత్సరాల క్రితం ‘వస్తుగుణ దీపిక’లో రాసి ఉందట. అందుకే ఎక్కడైనా తాటి బెల్లం అమ్మకానికి వస్తే ధర ఎక్కువైనా కొనేందుకు జనం ఎగబడతారు.

తాటిబెల్లం..ఇవి ప్రయోజనాలు:

1.తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది.

2.జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుంది.

3.ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది.

4.యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది.

5. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది.

6. శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది.

7. దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ సాయపడుతుంది.

8. మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియాను దూరం చేసే సుగుణాలు ఎన్నో ఉన్నాయని…అంతేకాదు వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ చెప్పొచ్చనేది వారి విశ్వాసం. తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 76.86, రెడ్యూసింగ్ చక్కెర 1.66, కొవ్వు 0.19, మాంసకృత్తులు 1.04, కాల్షియం 0.86, ఫాస్ఫరస్ 0.05, ఖనిజ లవణాలు 3.15 శాతం, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రేటు కొంచెం ఎక్కువైనా ఆరోగ్యానికి మాత్రం ఈ తాటి బెల్లం మంచి ఉపయోగకారి.

Follow Us