03 May 2026

తమలపాకుతో తట్టెడు లాభాలు.. ఇవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా

Krishna

తమలపాకులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వచ్చే దురద, చికాకు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీని పేస్ట్‌ను రాస్తే చర్మం చల్లబడి, మచ్చలు తగ్గుతాయి.

చర్మ సంరక్షణ

చిన్న చిన్న కోతలు, గాయాలు అయినప్పుడు శుభ్రం చేసిన తమలపాకును ఆ ప్రాంతంలో ఉంచితే ఇన్ఫెక్షన్ సోకకుండా చూస్తుంది. ఇది వాపును తగ్గించి గాయం త్వరగా మానడానికి దోహదపడుతుంది.

గాయాలు మానడానికి

జలుబు, దగ్గుతో బాధపడేవారు తమలపాకును కొద్దిగా వేడి చేసి ఛాతీపై ఉంచుకుంటే కఫం తగ్గుతుంది. తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

శ్వాసకోశ సమస్యల నివారణ

రోజూ తమలపాకు నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించి, నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచి నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది.

నోటి ఆరోగ్యం

తమలపాకులను నూరి ఆ పేస్ట్‌ను నుదుటికి పట్టించడం వల్ల ఒత్తిడి తగ్గి తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే దీని రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది.

తలనొప్పి నుండి ఉపశమనం

తమలపాకు జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇది కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల

తమలపాకులోని సహజ ఔషధ గుణాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలను నివారించడానికి సహాయపడుతుంది.

శరీరాన్ని వెచ్చగా ఉంచడం

తమలపాకును కేవలం సహజ రూపంలో వాడితేనే ప్రయోజనం ఉంటుంది. దీనిని పొగాకు లేదా ఇతర హానికరమైన పదార్థాలతో కలిపి తీసుకోకూడదు

మితంగా వాడాలి