ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు తింటే చాలు అన్నీ సెట్..! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి షుగర్ సమస్య దాకా..

|

Aug 27, 2024 | 1:33 PM

పప్పు, పచ్చడి, ఉక్మా మొదలు అన్ని రకాల వంటల్లో ఈ ఆకు తప్పనిసరిగా వాడుతుంటారు. దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు.. బోలెడన్నీ బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. అంతేకాదు.. ఖాళీ కడుపుతో రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులను నమిలితే చాలు మీరు ఊహించని లాభాలు పొందుతారు. అవేంటో తెలుసుకోండి.

ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు తింటే చాలు అన్నీ సెట్..! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి షుగర్ సమస్య దాకా..
Curry Leaves
Follow us on

ఆహారానికి కమ్మటి రుచిని అందించే కరివేపాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ నాలుగు నుంచి ఐదు కరివేపాకు ఆకులను ఖాళీ కడుపుతో నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో డైజెస్టివ్ ఎంజైములు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, విటమిన్ ఎ, బి, సి, ఇతోపాటు కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా ఖాళీ కడుపుతో తినడం వల్ల అధిక రక్తపోటును సులభంగా నయం చేయవచ్చు.

కరివేపాకును ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ప్రతిరోజూ నాలుగు కరివేపాకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముందుగా చెప్పినట్లు కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక చర్మ సమస్యలను నయం చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తింటే రక్తహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి చాలా మంచిది. కరివేపాకును ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాదు కంటి చూపు సమస్యలను కూడా దూరం చేస్తుంది. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే కరివేపాకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనకు కూడా చెక్ పెట్టొచ్చని అంటున్నారు. వీటిని తినడం ద్వారా తాజా శ్వాసను పొందవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకులను నమలడం ద్వారా హెయిర్‌ ఫాల్‌ని తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులలోని బీటా-కెరోటిన్, ప్రొటీన్ల వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణను అందించి బలంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కరివేపాకు ఆకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..