AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kharjura Kallu: ఖర్జూర కల్లుతో ఖతర్నాక్‌ బెనిఫిట్స్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉంటుంది. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండవచ్చు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత.

Kharjura Kallu: ఖర్జూర కల్లుతో ఖతర్నాక్‌ బెనిఫిట్స్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Kharjura Kallu
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2025 | 10:19 PM

Share

ఈత చెట్టు నుంచి ఈత కల్లు, తాటి చెట్టు నుంచి తాటి కల్లును తీస్తారు. తాటి కల్లును తాటి చెట్టు నుండి సేకరిస్తారు. ఈతకల్లుతో పోలిస్తే, తాటి కల్లు రుచిలో కాస్త భిన్నంగా ఉంటుంది. అలాగే ఈ కల్లు ప్రధానంగా 3 సీజన్లలో 4రకాలుగా లభిస్తుంది. మగచెట్ల నుండి పోద్దాడు కల్లు, దీనితో పాటు పరుపు, పండు, నాప కల్లు ఆడ తాటి చెట్ల నుండి లభిస్తుంది. కానీ ఖర్జూర కల్లు గురించి ఎప్పుడైనా విన్నారా..? అవును ఖర్జూర కల్లు ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్ని సార్లు తియ్యగా, వంగరుగా ఉంటుంది. కానీ ఖర్జూర కల్లు తియ్యగా, రుచిగా ఉంటుంది. అందకే ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు. ఖర్జూర కల్లులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీని వలన జీర్ణశక్తి మెరుగవతుది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెరుగుతుంది. దీని వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే ఖర్జూర కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. కల్లులో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఖర్జూర కల్లులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, దీని వలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని కల్లు ప్రియులు అంటున్నారు. ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉంటుంది. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండవచ్చు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.