Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కలిగే అద్భుతమైన ఫలితాలు ! మెరిసే చర్మంతో పాటు..

|

Sep 22, 2023 | 1:42 PM

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగైదు కరివేపాకులను నమిలి తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. కరివేపాకు ప్రయోజనాలు, ఏయే వ్యాధులకు ఔషధంగా కరివేపాకు పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం...

Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కలిగే అద్భుతమైన ఫలితాలు ! మెరిసే చర్మంతో పాటు..
Curry Leaves Benefits
Follow us on

వంటల్లో ఎక్కువగా సువాసన కోసం ఉపయోగించే కరివేపాకులను ఈజీగా తీసిపారేస్తుంటారు. చాలా మంది. కానీ, ఏ ఆయుర్వేద ఔషధం కంటే కరివేపాకు తక్కువకాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కరివేపాకులో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కరివేపాకు కేవలం వంటకు సువాసన, రుచి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగైదు కరివేపాకులను నమిలి తినటం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు. కరివేపాకు ప్రయోజనాలు, ఏయే వ్యాధులకు ఔషధంగా కరివేపాకు పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం…

1. మధుమేహం అదుపులో ఉంటుంది:

మధుమేహ రోగులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే మంచిది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కావాలంటే కరివేపాకును ఎండలో ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. ఊబకాయంపై దాడి:

పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడే వారికి, కరివేపాకు లాభదాయకంగా పని చేస్తుంది. ఉదయం లేవగానే కరివేపాకు నమలడం వల్ల శరీరం డిటాక్స్ అవ్వడమే కాకుండా మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీని కారణంగా, బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

3. చర్మ సమస్యలు దూరమవుతాయి:

కరివేపాకు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కరివేపాకు నమలడం వల్ల మేలు జరగడమే కాకుండా చర్మంపై కురుపులు, మొటిమలు కనిపిస్తే, ఈ ఆకులను మెత్తగా రుబ్బి వాటిపై అప్లై చేయాలి.. స్మూత్‌గా మర్ధన చేసుకోవాలి. ఇలా క్రమం తప్ప కుండా చేస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లో దీని ప్రభావం కనిపిస్తుంది.

4. కడుపునొప్పి నుండి ఉపశమనం:

కడుపునొప్పితో ఇబ్బందిపడుతున్న వారికి కరివేపాకు నీటిని తాగించాలి. ఇందుకోసం.. ఒక పాన్‌లో నీటిని మరిగించి, అందులో కొన్ని కరివేపాకులను వేయాలి. నీళ్లు సగానికి మరుగుతున్నప్పుడు వడపోసి గోరువెచ్చగా ఉండగానే తాగాలి. దీంతో అనేక పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. జుట్టుకు మేలు చేస్తుంది:

జుట్టు రాలడం లేదా ఇతర జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్న వారు కరివేపాకులను తప్పనిసరిగా తినాలి. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఇదీ కాకుండా, దీన్ని మెత్తగా రుబ్బుకుని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు, ఈ హెయిర్ మాస్క్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…