Health Tips: ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా..? యమడేంజర్! అతిగా తాగితే అంతే సంగతి
చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు దానిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవి వచ్చేసింది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో వేసవి ఎండల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మన శారీరక ఆరోగ్యం క్షిణిస్తుంది. శరీరాన్ని చల్లబరిచేందుకు, వేసవి తాపం నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూస్ లను తాగాలి. అందుకే చాలా మంది ఎండలో ఉపశమనం కోసం చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. చెరకు రసంలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు దానిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
చెరకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాల్లో ఇందులో కేలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఒక గ్లాసు చెరుకు రసంలో 250 కేలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువలన, చెరకు రసం అధికంగా లేదా నిరంతరంగా తాగుతూ ఉంటే ఊబకాయం కలిగించే ప్రమాదం ఉంది.
చెరకు రసంలో కేలరీలు, చక్కెర రెండూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇది ఊబకాయానికి దోహదం చేస్తుంది. అయితే దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు. అయితే, చెరకు రసంలో పోలికోసనాల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్ థినర్ గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఇది మనకు ప్రమాదకరం. ఎందుకంటే మనం గాయపడినప్పుడు, అది రక్తస్రావం పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి చెరుకు రసం ఎక్కువగా తాగకండి.
చెరకు రసంలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే, చెరకు రసం కామెర్లకు అద్భుతమైన ఔషధం. ఇది కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. ఇది బిలిరుబిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మనకు కామెర్లు వచ్చినప్పుడు, మన శరీరంలోని ప్రోటీన్ పెద్ద పరిమాణంలో విచ్ఛిన్నమవుతుంది. ఇది రక్తంలో బిలిరుబిన్ స్థాయిని పెంచుతుంది. ఈ బిలిరుబిన్ స్థాయిని నియంత్రించడానికి చెరకు రసం తాగుతారు. చెరకు రసం కోల్పోయిన ప్రోటీన్‌ను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.
చెరకు రసాన్ని మితంగా తాగడం వల్ల ఖచ్చితంగా మనకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల అవాంఛనీయ సమస్యలు వస్తాయి. చెరకు రసం మాత్రమే కాదు, ఏదైనా పదార్ధం అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదకరం అని గుర్తుంచుకోండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..