మగువల అందాన్నిపెంచే ఈ ఎర్రటి పండు..! రోజూ తింటే యంగ్‌ లుక్‌ మీ సొంతం..!!

ఇవి చర్మంపై గీతలు, ముడతలను తగ్గించి.. చర్మాన్ని స్టిఫ్‌గా చేస్తాయి. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి. వీటితో పాటు.. ఈ పండులోని లైకోపీన్‌, బీటా - కెరోటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు నిస్తేజంగా, కందిపోయిన చర్మాన్ని రిఫ్రెష్‌ చేస్తాయి. సన్‌బర్న్‌‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

మగువల అందాన్నిపెంచే ఈ ఎర్రటి పండు..! రోజూ తింటే యంగ్‌ లుక్‌ మీ సొంతం..!!
Watermelon
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 23, 2024 | 4:47 PM

పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో పుచ్చకాయ కూడా మార్కెట్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాటర్ కంటెంట్ పరంగా పుచ్చకాయ అన్ని పండ్లలో ముందుంటుంది. ఇందులో ఉన్నంత నీరు మరే పండులోనూ ఉండదని చెప్పవచ్చు. శరీరం మొత్తం ఆరోగ్యానికి సరైన జీర్ణక్రియ చాలా ముఖ్యం. పుచ్చకాయ తినడం జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. రక్త ప్రసరణకు, చర్మ ఆరోగ్యానికి పుచ్చకాయ చాలా మంచిది.

ఇది మహిళల్లో అందాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపల నుంచి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. క్యాల్షియం లోపానికి పుచ్చకాయ తినడం కూడా చాలా మంచిది. పుచ్చకాయలో L-citrulline ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. L-Citrulline కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంపై గీతలు, ముడతలను తగ్గించి.. చర్మాన్ని స్టిఫ్‌గా చేస్తాయి. ఇందులోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి. వీటితో పాటు.. పుచ్చకాయలోని లైకోపీన్‌, బీటా – కెరోటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు నిస్తేజంగా, కందిపోయిన చర్మాన్ని రిఫ్రెష్‌ చేస్తాయి. సన్‌బర్న్‌‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

పుచ్చకాయలోని ఎలక్ట్రోలైట్స్ శరీర రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా సహాయపడతాయి. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. అర్జినైన్, సిట్రులిన్ సాధారణంగా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిలో సహాయపడతాయి. ఇది రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో పొటాషియం ,మెగ్నీషియం ఉన్నాయి. ఇవి సమతుల్య రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!