Hair Care Tips: పట్టు లాంటి ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సూపర్‌ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి

|

Dec 02, 2022 | 6:25 PM

చిన్న వయసులోనే చుండ్రు, తెల్ల వెంట్రుకలు, వెంట్రుకలు సన్నబడడం, రాలిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతున్నారు. అయితే ఆశించిన ఫలితాలు రావడం లేదు.

Hair Care Tips: పట్టు లాంటి ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సూపర్‌ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Hair Care
Follow us on

ప్రస్తుతం జుట్టుకు సంబంధించిన సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే చుండ్రు, తెల్ల వెంట్రుకలు, వెంట్రుకలు సన్నబడడం, రాలిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో రకరకాల షాంపూలు, నూనెలు వాడుతున్నారు. అయితే ఆశించిన ఫలితాలు రావడం లేదు. అయితే వీటికి బదులు డైట్‌లో మార్పులు చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటే హెయిర్‌ ఫాల్‌తో పలు జుట్టు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

క్యారెట్‌

క్యారెట్‌లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు జుట్టును బలంగా, పొడవుగామార్చడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

పాలకూర

బచ్చలికూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి కాకుండా మరెన్నో రకాల పోషకాలు పాలకూరలో లభిస్తాయి. మీరు మీ ఆహారంలో పాలకూర రసం, ఆకుకూరలు లేదా కూరగాయగా చేర్చుకోవచ్చు. జుట్టు పెరుగుదలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బచ్చలికూర శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపల్లో అధిక ప్రొటీన్లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. దీనితో పాటు, జుట్టును బలోపేతం చేయడానికి కూడా చాలా సహాయకారిగా ఉంటాయి.

గుడ్లు

మంచి జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. గుడ్లు ప్రోటీన్ ప్రధాన మూలం. హెయిర్ ఫోలికల్స్ (జుట్టు కుదుళ్లు) ఎక్కువగా ప్రోటీన్‌తో తయారవుతాయి. కాబట్టి మీరు ఆహారంలో గుడ్లను కూడా చేర్చుకోవచ్చు. కావాలంటే, జుట్టుకు పచ్చి గుడ్డును కూడా పూయవచ్చు. ఇది కాకుండా, మీరు చియా విత్తనాలను ఉపయోగించవచ్చు. ఇందులో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జుట్టును ఒత్తుగా, అందంగా మార్చడంలో ఇవి సహాయపడతాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..