Hair Care Tips: బీకేర్‌ఫుల్.. ఈ ఆహారాలు తింటే మీకు త్వరగా బట్టతల రావడం ఖాయం..!

ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును కోరుకుంటాడు. కానీ పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి కారణంగా అది అసాధ్యంగా మారుతోంది. దీనికి తోడు కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలను తినడం కూడా జుట్టు రాలే సమస్యకు కారణం అవుతుంది. దీని వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.

Hair Care Tips: బీకేర్‌ఫుల్.. ఈ ఆహారాలు తింటే మీకు త్వరగా బట్టతల రావడం ఖాయం..!
Hair Loss Foods

Updated on: May 29, 2023 | 6:06 PM

ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును కోరుకుంటాడు. కానీ పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి కారణంగా అది అసాధ్యంగా మారుతోంది. దీనికి తోడు కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలను తినడం కూడా జుట్టు రాలే సమస్యకు కారణం అవుతుంది. దీని వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో.. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని ఆహారాలు జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. మరి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అధిక చక్కెర పదార్థాలు..

అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తినడం మానుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా.. జుట్టుకు కూడా మంచిది కాదు. హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. అధికంగా స్వీట్స్ తినడం వల్ల బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినొద్దు..

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోవాలి. ఆహారం ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి అనేక రకాల రంగులు, కృత్రిమ రసాయనాలు ఉపయోగిస్తారు. అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెర మరియు ఉప్పును ఇందులో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మీ జుట్టుకు మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్స్..

జంక్ ఫుడ్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. వాటిలో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఆహారాలలో పోషకాలు కూడా ఉండవు. జుట్టుకు ఇవి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆహారాలు గుండె సంబంధిత వ్యాధులను కలిగించడమే కాకుండా మీ జుట్టును కోల్పోయేలా చేస్తాయి.

మద్యం..

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా, శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడుతుంది. పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అందుకే అధికంగా ఆల్కాహాల్ తీసుకోవడం మానుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..