
Hair Care Tips: అందరూ పొడవాటి, మందమైన జుట్టును ఇష్టపడతారు. కానీ నేటి బిజీ జీవనశైలి కారణంగా ఇది సాధ్యపడటం లేదు. ఒత్తిడి వల్ల ఉన్న జుట్టు ఊడిపోతుంది. అలాంటి పరిస్థితిలో జుట్టు రాలడం సమస్యను అధిగమించడానికి, చాలామంది పార్లర్‌లో అనేక రకాల చికిత్సలు తీసుకుంటారు. కానీ మీ జీవనశైలిలో జుట్టుకు కావలసిన పోషకాలను మాత్రం అందించడం లేదు. ఆరోగ్యకరమైన, పొడవైన జుట్టు కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి. వీటి ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
1. ముఖ్యమైన నూనె వాడండి..
జుట్టు మందంగా దృఢంగా ఉండాలంటే ఎంపిక చేసిన నూనెను వాడాలి. జుట్టు పెరుగుదలను పెంచడానికి జోజోబా ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ ఉపయోగించవచ్చు.
2. ప్రోటీన్ తీసుకోవడం పెంచండి
ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది మీ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. సమతుల్య ఆహారం తీసుకోండి. తద్వారా జుట్టుకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ డి, ఈ, ఒమేగా -3 ఉన్న వాటిని తినండి.
3. డైటింగ్ నుంచి దూరంగా ఉండండి
డైటింగ్ వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది. దీనితో పాటుగా జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఇది కాకుండా ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం పెరుగుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి మీ సమస్యలను పరిష్కరించగలవు.
4. కెఫిన్ కలిగిన ఉత్పత్తులను ఉపయోగించండి
కెఫిన్ కలిగిన ఉత్పత్తులు పురుషులు, మహిళల జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ రోజువారీ జుట్టు సంరక్షణ దినచర్యలో కెఫిన్‌కు సంబంధించిన పదార్థాలను వాడండి. సాధారణ షాంపూ వాడండి ఎండలో ఎక్కువగా తిరగొద్దు.