
అందమైన, పొడవాటి జుట్టు కావాలిన ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. సిల్కీ, మెరిసే, పొడవాటి వాలు జడపై ఎన్నో కవిత్వాలు, సినిమాల్లో పాఠలు రాసిన సందర్భాలూ ఉన్నాయి. మహిళల అందాన్ని రెట్టింపు చేయడంలో వారి జుట్టుది కీలక పాత్ర అని చెప్పాలి. పొడవాటి జుట్టును చూసి వివాహాలు చేసుకున్న వారు, ప్రేమించిన వారు కూడా ఉన్నారు. మహిళలు కూడా తమ జుట్టు సంరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. మెరిసే, మృదువైన జుట్టు ఉంటే.. అనేక రకాలుగా కేశాలంకరణ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే రకరకాల ప్రోడక్ట్స్ ఉపయోగించి మరీ జుట్టును కాపాడుకుంటారు మహిళామణులు. అయితే, ప్రస్తుత వాతావరణ కాలుష్యం, బిజీ లైఫ్‌లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు సహజ సౌందర్యం కోల్పోతోంది. ఈ నేపథ్యంలో మీకోసమే ఈ అదిరిపోయే న్యూస్ తీసుకువచ్చాం. వంటింటి చిట్కాలతోనే మెరిసే, మృధువైన జుట్టును సొంతం చేసుకునే మార్గం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం గుడ్డును ఉపయోగించవచ్చు. గుడ్డులో ప్రోటీన్స్, కొవ్వు ఆమ్లాలు, లెక్టిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేస్తే మరింత వేగంగా ప్రభావం కనిపిస్తుంది.
మీ జుట్టు సౌందర్యాన్ని కోల్పోయినట్లయితే, ఆ మెరుపును తిరిగి పొందాలనుకుంటే ‘బీర్’ అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. జుట్టు సంరక్షణ కోసం బీర్‌ను కూడా ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. బీర్ చాలా మంది హెయిర్ టానిక్ మాదిరిగా పని చేస్తుందట. ఇందులో ఉండే ప్రోటీన్స్ జుట్టును రిపేర్ చేస్తాయి. ఇది జుట్టు మెరుపును పునరుద్ధరిస్తుంది.
జుట్టు సంరక్షణకు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెతో జుట్టుకు మర్దన చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది. జుట్టుకు కొత్త శక్తిని ఇస్తుంది. కొబ్బరి నూనెలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టును తేమ గా మారుస్తుంది. పొడిబారకుండా చేస్తుంది.
జుట్టు సంరక్షణ కోసం తేనె ను కూడా ఉపయోగించవచ్చు. జుట్టును మృదువుగా చేయడంలో తేనె అద్భుతంగా పని చేస్తుంది. దీనిని పెరుగుతో కలిపి అప్లై చేస్తే అద్భుత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు హెయిర్ కేర్ నిపుణులు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..