Hair Care Tips: జుట్టు తడిగా ఉన్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. తేడా వస్తే బట్టతల అవడం ఖాయం..
జట్టు రాలే సమస్యకు ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు ఒకటైతే.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మరో కారణం అవుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు.
జట్టు రాలే సమస్యకు ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు ఒకటైతే.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మరో కారణం అవుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టుకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు పూర్తిగా పాడైపోతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతంది. ఇదిలాఉంటే.. కొందరు రకరకాల షాంపూలతో తలస్నానం చేసిన తరువాత కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్ల కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. మరి జుట్టు రాలే సమస్యను ఎలా నివారించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తలస్నానం చేసిన తరువాత ఈ తప్పులు చేయొద్దు..
1. తలస్నానం చేసిన తరువాత తడి జుట్టును అస్సలు దువ్వొద్దు. ఎందుకంటే.. తడి జుట్టును దువ్వడం వలన అది విరిగిపోతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. అందుకే జుట్టు సరిగా ఆరిన తరువాత దానిని దువ్వాలి. అలాగే మందపాటు బ్రష్‌తో కూడిన దెవ్వెనను వినియోగించాలి.
2. జుట్టు కట్టడం మానుకోవాలి. తడి జుట్టును కట్టుకోవద్దు. ఎందుకంటే.. జుట్టును పోపనీటైల్‌లో కట్టినప్పుడు అవి లాగుతాయి. ఇది జుట్టు విరిగిపోవడానికి కారణం అవుతుంది. అందుకే జుట్టు ఆరిత నువాత మాత్రమే కట్టాలి.
3. చాలా మంది తడి జుట్టు మీద హెయిర్ స్ప్రేని ఉపయోగిస్తారు. అయితే, అది జుట్టుకు మరింత హానీ తలపెడుతుంది. అందుకే ఇలా చేయొద్దు. జుట్టు ఆరిన తరువాత మాత్రమే హెయిర్ స్ప్రే వాడాలి.
4. తడి జుట్టును టవల్‌తో చుట్టొద్దు. చాలా మందికి టవల్‌తో జుట్టు కట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ, అలా చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జుట్టు విరిగిపోతుంది. టవర్‌తో జుట్టును కట్టుకునే బదులు.. ఆరబెట్టే ప్రయత్నం చేయండి.
లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..