AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్లు, ఖనిజాలకు నిలయం.. ఉదయాన్నే గిన్నెడు తింటే రోజంతా ఏనుగు లాంటి శక్తి..

పెసలు ప్రోటీన్‌, పీచు, ఫోలేట్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించే ఆరోగ్యకరమైన పప్పుధాన్యం. వీటిని మొలకలు, ఉడికించిన పెసలు లేదా పెసరపప్పు రూపంలో ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన భావన, జీర్ణక్రియ, బరువు నియంత్రణకు తోడ్పడవచ్చు.. పెసలు ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకోండి..

విటమిన్లు, ఖనిజాలకు నిలయం.. ఉదయాన్నే గిన్నెడు తింటే రోజంతా ఏనుగు లాంటి శక్తి..
Green Gram Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2026 | 1:19 PM

Share

శరీరానికి అవసరమైన అద్భుతమైన ఆహార పదార్థాలలో పెసలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. పూర్వీకుల కాలం నుండి వీటిని మన ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వైద్యులు కూడా రోజువారీ ఆహారంలో పెసలను చేర్చుకోవాలని బలంగా సిఫార్సు చేస్తున్నారు. పెసలు కేవలం రుచికరమైనవే కాకుండా, మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. జ్వరం, మలబద్ధకం వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

పోషకాల గని పెసలు:

పెసలు ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. ఈ ప్రోటీన్లు శరీర నిర్మాణం, కండరాల పనితీరు మెరుగుదల, దెబ్బతిన్న కణజాలాల మరమ్మత్తుకు అత్యవసరం. అంతేకాకుండా, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పెసలను నీటిలో నానబెట్టి, మొలకెత్తించి తినడం.. లేదా ఉడికించి  తినడం వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. మొలకెత్తిన పెసలలో విటమిన్లు A, B, C, E లు అధికంగా ఉంటాయి. అలాగే, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ వంటి ముఖ్యమైన ఖనిజాలు, డైటరీ ఫైబర్‌లు పుష్కలంగా లభిస్తాయి.

బరువు తగ్గడంలో సహాయం:

పెసలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, బరువు పెరుగుతామన్న భయం లేకుండా వీటిని నిర్భయంగా తినవచ్చు. వాస్తవానికి, పెసలు బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో పెసలను చేర్చుకోవడం ద్వారా రక్తహీనత వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. పెసలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ఆకలి నియంత్రించబడుతుంది, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

ఒక కప్పు పెసరపప్పును చపాతీలతో రాత్రిపూట తీసుకుంటే క్రమంగా బరువు తగ్గుతారని పరిశోధకులు సూచిస్తున్నారు. బియ్యంలో కొద్దిగా పెసలు కలిపి పులగం చేసుకుని తినడం కూడా ఊహించని బరువు తగ్గడానికి సహాయపడుతుందని వారు చెబుతున్నారు. తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు రోజు పెసలను తింటే ఆకలి అదుపులోకి వస్తుంది.

డయాబెటిస్ – గుండె ఆరోగ్యం:

రోజువారీ ఆహారంలో పెసలను భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య నుండి బయటపడవచ్చు.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. పెసలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెసలు శరీర మెటబాలిజంను పెంచడానికి సహాయపడతాయి. ఇది కొవ్వు కరిగి బరువు తగ్గడానికి మరింత దోహదపడుతుంది.

రక్తపోటు నియంత్రణ – జీర్ణక్రియ మెరుగుదల:

పెసలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ పేగులలోని వ్యర్థాలను బయటకు పంపి, పేగులను శుభ్రంగా ఉంచుతుంది. ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పెసలు ఒక అద్భుతమైన పరిష్కారం. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇతర ప్రయోజనాలు:

పెసలు స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక ఆరోగ్య సమస్యలను తగ్గించి, సామర్థ్యాన్ని పెంచుతాయని, సంతానం కలిగే అవకాశాలను మెరుగుపరుస్తాయని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెసలలో ఉండే సోడియం బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

మొత్తంమీద, పెసలు ఒక సమగ్రమైన సూపర్ ఫుడ్. వాటిని రోజువారీ ఆహారంలో గిన్నెడు పెసలు భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us