Kitchen Hacks: పచ్చిమిర్చిని ఇలా స్టోర్ చేస్తే నెలరోజుల వరకూ ఫ్రెష్‌గా ఉంటాయి..

|

Sep 23, 2024 | 12:56 PM

ప్రస్తుత కాలంలో కూరగాయల ధరలు ఎలా ఉంటున్నాయో చెప్పడం కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడే రేట్లు అనేవి పెరిగి పోతున్నాయి. ఇలా తక్కువగా ఉన్నప్పుడే కాస్త ఎక్కువగా కూరగాయల్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వీటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. వీటిని మనం ప్రతి రోజూ కూరల్లో, చట్నీలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా పచ్చి మిర్చి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొని తీసుకొస్తూ ఉంటారు. అయితే చాలా మందికి వీటిని స్టోర్ చేయడం తెలీదు. దీంతో ఇవి త్వరగా పది రోజులకే..

Kitchen Hacks: పచ్చిమిర్చిని ఇలా స్టోర్ చేస్తే నెలరోజుల వరకూ ఫ్రెష్‌గా ఉంటాయి..
Kitchen Hacks
Follow us on

ప్రస్తుత కాలంలో కూరగాయల ధరలు ఎలా ఉంటున్నాయో చెప్పడం కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడే రేట్లు అనేవి పెరిగి పోతున్నాయి. ఇలా తక్కువగా ఉన్నప్పుడే కాస్త ఎక్కువగా కూరగాయల్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వీటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. వీటిని మనం ప్రతి రోజూ కూరల్లో, చట్నీలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా పచ్చి మిర్చి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొని తీసుకొస్తూ ఉంటారు. అయితే చాలా మందికి వీటిని స్టోర్ చేయడం తెలీదు. దీంతో ఇవి త్వరగా పది రోజులకే కుళ్లిపోతాయి. దీంతో చాలా బాధగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పిన విధంగా పచ్చిమిర్చిని కనుక స్టోర్ చేస్తే.. నెల రోజుల వరకు పాడవకుండా.. చాలా తాజాగా ఉంటాయి. మరి వీటిని ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

కుళ్లినవి తీసేయండి:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే అన్నీ కలిపి కవర్‌లో కలిపి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. వీటిల్లో కుళ్లినవి కూడా ఉంటాయి. వాటి వలన మిగతావి కూడా కుళ్లిపోతాయి. కాబట్టి ఏవన్నా పాడైపోయినవి ఉంటే వెంటనే వాటిని తీసేయండి. అలాగే మిర్చికి ఉన్న తొడిమలు తీసేయాలి.

కంటైనర్‌లో స్టోర్:

కవర్‌లో ఎక్కువ రోజులు పచ్చి మిర్చి పెడితే త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కంటైనర్‌లో కూడా పచ్చి మిర్చిని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ కవర్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ.. కవర్స్ మార్చుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

పొడిగా ఉన్నవి స్టోర్ చేయాలి:

చాలా మంది చేసే తప్పుల్లో ఇది కూడా ఒకటి. పచ్చి మిర్చిని తీసుకు రాగానే కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. అలా కాకుండా అవి తడిగా ఉంటే ఆరబెట్టండి. ఆ తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

జిప్ లాక్ బ్యాగ్స్‌:

జిప్ లాక్ బ్యాగ్స్‌లో కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు. ముందుగా పచ్చి మిర్చిని ఆరబెట్టి.. ఆ తర్వాత మాత్రమే గాలి అంతా పోయిన తర్వాత జిప్ లాక్ బ్యాగ్స్‌లో ఉంచాలి. అలాగే ఒక్కోసారి పచ్చి మిర్చి రంగు మారుతూ ఉంటాయి. అలా రంగు మారిన పచ్చి మిర్చిని తీసేయాలి. వాటిని త్వరగా కూరల్లో ఉపయోగించాలి. వీటి వల్ల మిగతావి కూడా పాడైపోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..