చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే మంచం మీద నుంచి దిగక ముందే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది ఉదయం లేవగానే చేసే మొదటి పని కాఫీ లేదా టీని తాగడం. టీ లేదా కాఫీ ని తాగడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. అయితే నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో సెలబ్రిటీలు కూడా తమ డైట్ లో నెయ్యి కాఫీని చేర్చుకుంటున్నారు. ఈ నెయ్యి కాఫీ తాగే ముందు.. దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఆకలిని నియంత్రిస్తుంది: నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇది ఆకలిని నివారిస్తుంది.అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. కేలరీలను తగ్గించి శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది: నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉన్నందున ఉదయాన్నే నెయ్యి కాఫీని తాగడం వలన మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: నెయ్యి కాఫీ జీర్ణక్రియను, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
జీవక్రియను పెంచుతుంది : నెయ్యిలో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. శరీరాన్ని శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును మార్చడానికి అనుమతిస్తుంది.
శరీరానికి నిరంతర శక్తిని అందిస్తుంది: కాఫీ తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే నెయ్యి కాఫీని తాగడం వలన కొవ్వులు కెఫిన్ విడుదలను మందగిస్తాయి. ఇది శరీరానికి స్థిరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది: నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది: నెయ్యి కాఫీ తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యం గా ఉంటుంది. అంతేకాదు జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)