Get Rid of Blackheads: ఈ సింపుల్ టిప్స్‌తో ముక్కుపై బ్లాక్‌ హెడ్స్‌ని పోగొట్టండి..

మగువల అందానికి ఈ బ్లాక్ హెడ్స్ కూడా తలనొప్పిగా మారతాయి. చాలా మందికి ముఖంపై అక్కడక్కడా బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి ముక్కుపై మాత్రమే మరింత ఎక్కువగా వస్తాయి. దీంతో చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. చర్మంపై మురికి, మృత కణాలు బాగా పేరుకు పోవడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హెడ్స్ అనేవి తరచూ వస్తూనే ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి చాలా మంది పార్లర్స్‌కి వెళ్తే.. ఇంకొంత మంది మార్కెట్లో లభ్యమయ్యే..

Get Rid of Blackheads: ఈ సింపుల్ టిప్స్‌తో ముక్కుపై బ్లాక్‌ హెడ్స్‌ని పోగొట్టండి..
Blackheads

Updated on: Mar 19, 2024 | 2:56 PM

మగువల అందానికి ఈ బ్లాక్ హెడ్స్ కూడా తలనొప్పిగా మారతాయి. చాలా మందికి ముఖంపై అక్కడక్కడా బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి ముక్కుపై మాత్రమే మరింత ఎక్కువగా వస్తాయి. దీంతో చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. చర్మంపై మురికి, మృత కణాలు బాగా పేరుకు పోవడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హెడ్స్ అనేవి తరచూ వస్తూనే ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి చాలా మంది పార్లర్స్‌కి వెళ్తే.. ఇంకొంత మంది మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడెక్ట్స్‌ని ఉపయోగిస్తారు. వీటి వలన చర్మానికి కూడా నష్టం కలగవచ్చు. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే వీటికి బందులు ఇంట్లోని కొన్ని నేచురల్ టిప్స్ ఉపయోగిస్తే సరి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

గుడ్డు తెల్లసొనతో..

కోడిగుడ్డులోని తెల్ల సొనతో కూడా బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని.. ముఖానికి పట్టించండి. ఇది బాగా ఆరిన తర్వాత.. గుడ్డులోని తెల్లసొనను మళ్లీ రెండోసారి అప్లై చేయాలి. ఇప్పుడు ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేస్తే.. మృతకణాలు కూడా తగ్గుతాయి.

టమాటా:

బాగా పండిన టమాటా తీసుకోండి. ఇది గ్రైండ్ చేసి.. ఆ పేస్ట్‌ని ముఖం అంతా పట్టించండి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేయండి. ఆ తర్వాత ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరి. ఇలా చేయడం వల్ల బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ పోవడమే కాకుండా.. ముఖం కూడా కాంతి వంతంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క పొడితో..

ఒక గిన్నెలోకి కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం లేదా బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే సరిపోతుంది. పది నిమిషాల తర్వాత కాటన్ సహాయంతో తుడిచేయండి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం కడిగేసుకోండి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ త్వరగా పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..