స్వీట్స్‌కి గుడ్‌బై చెప్పి.. ఆయిల్ ఫుడ్ ని తెగ లాగించేస్తున్నారా.? అయితే మీరు ఇక షెడ్డుకే

ప్రపంచాన్ని వణికించిన కరోనా తర్వాత మనసుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దీంతో జీవన శైలితో పాటు తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల్య ఆహారం తినడం ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు చిన్నప్పటి నుండే అందరూ తాము తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. గత కొంతకాలంగా చక్కర ఉన్న ఆహారాన్ని తినొద్దు అనే ప్రచారం ఊపు అందుకుంది. దీంతో చక్కరతో చేసిన పదార్ధాలకు బదులుగా నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యకరమో కాదో ఈ రోజు తెలుసుకుందాం..

స్వీట్స్‌కి గుడ్‌బై చెప్పి.. ఆయిల్ ఫుడ్ ని తెగ లాగించేస్తున్నారా.? అయితే మీరు ఇక షెడ్డుకే
Fried Foods Vs. Sugar

Updated on: Jul 16, 2025 | 1:01 PM

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయానికి వస్తే..మొదట చక్కెర కలిగిన ఆహారాన్ని తినొద్దు అని సలహా ఇస్తారు. మంచి ఫిట్‌నెస్ కోసం చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే సమోసాలు, పకోడాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాన్ని తినడంమొదలు పెడతారు. కానీ మీకు తెలుసా? ఈ ఆహారపదార్థాలు చక్కెర కంటే ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. అయితే మనం ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టము. చక్కెర ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే అనేక అధ్యయనాలు నూనె పదార్థాలను అధికంగా తీసుకోవడం చక్కెర కంటే ఎక్కువ హానికరం అని చెబుతున్నాయి.

ఈ విషయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వారానికి 4 సార్లు కంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినేవారికి గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 50% ఎక్కువగా ఉందని తేలింది. అదేవిధంగా అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం వేయించిన ఆహారంలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, అక్రిలామైడ్ వంటి అంశాలు క్యాన్సర్ కారకాలని.. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతాయని వెల్లడించింది.

నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం హానికరం

నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ (సమోసాలు, జిలేబీలు, బిస్కెట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి) లో ఉండే హైడ్రోజనేటెడ్ ఆయిల్ నేరుగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతే కాదు సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులకు ప్రధాన కారణంగా మారతాయి. అత్యంత దారుణమైన నిజం ఏమిటంటే వేయించిన ఆహారం శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇది క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు మూల కారణం.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా నూనె పదార్థాలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

  1. బాగా వేయించిన ఆహారాలలో సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా ధమనులు గట్టిపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
  2. నూనె పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి రోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వేగంగా పెరుగుతుంది.
  3. వేయించిన ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయి. ఇది ఇన్సులిన్ హార్మోన్ పనితీరును ప్రభావితం చేస్తుంది . డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  4. అధిక కొవ్వు , ట్రాన్స్ ఫ్యాట్స్ లు కాలేయాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవ్వు కాలేయానికి దారితీస్తుంది. ఇది కాలేయ వైఫల్యానికి మరింత చేరువ చేస్తుంది.
  5. వేయించిన ఆహార పదార్థాల రుచి మన మనసును ఆకట్టుకుంటున్నప్పటికీ అవి నెమ్మదిగా శరీరాన్ని వ్యాధులకు నిలయంగా మారుస్తాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా సరే జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండలని మంచి ఆరోగ్యం కోరుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలను మాత్రమే కాదు నూనెలో వేయించిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)