Ladies Finger for Health: బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..! ఎందుకంటే..

మనం నిత్యం తినే కూరగాయల వల్ల మనకు తెలియని అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ కూరగాయలలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, మినరల్స్..

Ladies Finger for Health: బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..! ఎందుకంటే..
Health Benefits Of Ladies Finger

Updated on: Jan 27, 2023 | 9:48 PM

మనం నిత్యం తినే కూరగాయల వల్ల మనకు తెలియని అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ కూరగాయలలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి అలా మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బెండకాయలను చాలా మంది వేపుడుగా తినడానికి ఇష్టపడుతుంటారు. బెండకాయను ఓక్రా లేదంటే లేడీస్ ఫింగర్ అని కూడా అంటారు. ఇక కొందరు బెండకాయ తినడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం బెండకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. మరి బెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బెండకాయలో ఫోలేట్, నియాసిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పెక్టిన్ అనే పదార్థం కూడా ఉంటుంది. గుండె జబ్బులకు చెడు కొలెస్ట్రాల్ ఒక కారణం. బెండకాయను ఎక్కువగా తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే డయాబెటిస్ వారికి కూడా బెండకాయ గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇందులో అధికశాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేందుకు తోడ్పడుతుంది. దాంతోపాటుగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇతర కూరగాయలతో పోల్చుకుంటే బెండకాయలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బెండకాయలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో విటమిన్ కె, ఫోలేట్, ఐరన్ ఉంటాయి.. ఇది రక్త ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అలాగే రక్తహీనతను సమస్యను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు బెండకాయ ఒక మంచి వరం అని చెప్పవచ్చు. అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున బెండకాయ కూరతో కొద్దిగా అన్నంతిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో తక్కువగా ఆకలి అయ్యి బరువు ఈజీగా తగ్గుతారు. బెండకాయ అధిక మొత్తంలో కరగని డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మొత్తం జీర్ణవ్యవస్థను, ముఖ్యంగా పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..