Raw Carrots: క్యారెట్లను పచ్చిగానే తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమని చెబుతున్నారంటే..

|

Mar 25, 2023 | 6:20 PM

పచ్చిగానే కూరగాయలను, ఆకు కూరలను తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? ఈ విషయంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో పోషకాహార నిపుణులు పచ్చి కూరగాయలతోనే ఎక్కువ లాభం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పచ్చి..

Raw Carrots: క్యారెట్లను పచ్చిగానే తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమని చెబుతున్నారంటే..
raw carrot benefits
Follow us on

మనలో చాలా మంది కొన్ని రకాల కూరగాయలను పచ్చిగానే తినేస్తుంటారు. ఇలా తినేవాటిలో క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటో, దొండకాయ వంటివి ప్రధానమైనవి. అయితే ఇలా పచ్చిగానే కూరగాయలను, ఆకు కూరలను తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? ఈ విషయంపై చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో పోషకాహార నిపుణులు పచ్చి కూరగాయలతోనే ఎక్కువ లాభం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పచ్చి కూరగాయలను తినే క్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న క్యారెట్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయట. క్యారెట్‌ను ఉడకబెట్టి, వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు నిపుణులు. క్యారెట్‌తో ప్రధానంగా మహిళలకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో పచ్చి క్యారెట్‌ను తినడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హార్మోన్ బ్యాలెన్స్‌: పచ్చి క్యారెట్‌ను తినడం వల్ల దానిలోని ఫైబర్ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి క్రమబద్ధీకరిస్తుంది. వాస్తవానికి ఈస్ట్రోజెన్‌ అధికమైతే మొటిమలు, మూడ్ స్వింగ్స్ వంటి వాటితో సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ సమస్యను అరికట్టడంలో క్యారెట్ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పచ్చి క్యారెట్లు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి.

ఈస్ట్రోజెన్‌ నియంత్రణ: క్యారెట్‌లో ప్రత్యేకమైన ఫైబర్‌లు ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను నియంత్రించడంతో పాటు ఇవి అదనపు ఈస్ట్రోజెన్‌ను తగ్గించడానికి సాయపడతాయి. అలాగే కాలేయం మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి కూడా క్యారెట్ సాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎండోటాక్సిన్‌ డిటాక్స్: శరీరంలోని ఎండోటాక్సిన్, బ్యాక్టీరియా, ఈస్ట్రోజెన్‌లను పచ్చి క్యారెట్లు బాగా నియంత్రిస్తాయి. రోజూ ఒక పచ్చి క్యారెట్ తీసుకోవడం ద్వారా అధిక మోతాదులో ఎండోటాక్సిన్‌, కార్టిసాల్, ఈస్ట్రోజెన్‌‌లు వృద్ధి చెందకుండా చేస్తుంది. ఎండోటాక్సిన్ల డిటాక్స్‌కు క్యారెట్లు దివ్యౌధంలా పనిచేస్తాయి.

విటమిన్ ఏ: క్యారెట్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA) లెక్కల ప్రకారం 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు కనీసం 700 నుంచి 900 మైక్రోగ్రాముల విటమిన్ A అవసరం. ఒక పచ్చి క్యారెట్‌ తింటే అందుకు తగిన విటమిన్ ఏ ఉంటుందని FDA చెబుతోంది.

మెరిసే చర్మం: క్యారెట్లు విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌తో నిండి ఉంటాయి. అందువల్ల పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలు,మంటను తగ్గించడంతోపాటు సెల్ టర్నోవర్(సహజ ఎక్స్‌ఫోలియేషన్)ను ప్రోత్సహించడం ద్వారా మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.

థైరాయిడ్ బ్యాలెన్స్‌: విటమిన్ ఏ థైరాయిడ్ పనితీరుపై అనుకూల ప్రభావం చూపుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్‌లు గొప్ప వరం లాంటిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..